అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే వచ్చే పదమేంటో  ఒకసారి ప్రయత్నించండి.

Updated : 03 Mar 2022 02:50 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే వచ్చే పదమేంటో  ఒకసారి ప్రయత్నించండి.


తమాషా ప్రశ్నలు

1. బంగాళాఖాతం ఏ స్టేట్‌లో ఉంటుంది?

2. శిఖర్‌ పర్సులో రెండు నోట్లు ఉన్నాయట. వాటి మొత్తం 550 రూపాయలు. కానీ, అందులో ఒక నోటు రూ.50 కాదట. మరి ఎలా సాధ్యమబ్బా?

3. కూరగాయల్లో నెంబర్‌ వన్‌ ఏది?


నేనెవర్ని?

1. ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 5, 6, 7 అక్షరాలను కలిపితే చల్లగా ఉంటా. 2, 3 అక్షరాలు ‘మేము లేదా మాకు’ అనే అర్థాన్నిస్తాయి. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను ఆరు అక్షరాల తెలుగు పదాన్ని. మొదటి రెండు అక్షరాలు ఓ అమ్మాయి పేరును సూచిస్తే.. 3, 4, 5 అక్షరాలు కలిస్తే హోదా, గొప్పదనం అనే అర్థాలొస్తాయి. ఇంతకీ నేను ఎవరిని?


క్విజ్‌.. క్విజ్‌..!

1. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే మిషన్‌కు పెట్టిన పేరేంటి?

2. వచ్చే ఏడాది హాకీ ప్రపంచ కప్‌ ఏ దేశంలో జరగనుంది?

3. రాజుల కాలంలో ఉత్తర ప్రత్యుత్తరాలు ఏ పక్షి సహాయంతో సాగేవి?

4. అద్దంలో తన ముఖాన్ని గుర్తుపట్టగలిగే జీవి ఏది?

5. రక్తం గడ్డకట్టేందుకు సహకరించే విటమిన్‌ పేరేంటి?

6. ఇటీవల రష్యా దాడిలో ధ్వంసమైన ప్రపంచంలోనే అతిపెద్ద విమానం పేరు ఏంటి?


కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేను గీసిన బొమ్మ!


జవాబులు

అక్షరాల చెట్టు : CERTIFICATION

తమాషా ప్రశ్నలు : 1.లిక్విడ్‌ స్టేట్‌లో..  2.ఒక నోటు రూ.50 కాదు కానీ రెండో నోటు మాత్రం యాభయ్యే..  3.వంకాయ (వన్‌-కాయ)

నేనెవర్ని : 1. JUSTICE   2. కీర్తిప్రతిష్టలు

క్విజ్‌.. క్విజ్‌..: 1.‘ఆపరేషన్‌ గంగా’  2.భారత్‌  3.పావురం  4.డాల్ఫిన్‌  5.విటమిన్‌-కె  6.మ్రియా

కవలలేవి : 3, 4


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని