కార్టూన్‌ బొమ్మా? కాదు కదిలే జీవి!

ఎనిమిది జతల కాళ్లతో ఉండే ఆక్టోపస్‌ తెలుసుగా? ఇంచుమించు అదే రూపంతో స్క్విడ్స్‌ అనే జలచరాలు కూడా ఉంటాయి. వీటన్నింటినీ కలిపి ‘సెఫలోపాడ్స్‌’ అంటారు. అంటే తలకే చేతులుండే జీవులని అర్థం. ఇక మన పేజీలోకి వచ్చిన ఈ వింత జీవి విషయానికి వస్తే... దాదాపు 304 జాతులుండే స్క్విడ్లలో ఇదీ ఒకటి....

Published : 18 May 2017 01:06 IST

కార్టూన్‌ బొమ్మా? కాదు కదిలే జీవి!

ఎనిమిది జతల కాళ్లతో ఉండే ఆక్టోపస్‌ తెలుసుగా? ఇంచుమించు అదే రూపంతో స్క్విడ్స్‌ అనే జలచరాలు కూడా ఉంటాయి. వీటన్నింటినీ కలిపి ‘సెఫలోపాడ్స్‌’ అంటారు. అంటే తలకే చేతులుండే జీవులని అర్థం. ఇక మన పేజీలోకి వచ్చిన ఈ వింత జీవి విషయానికి వస్తే... దాదాపు 304 జాతులుండే స్క్విడ్లలో ఇదీ ఒకటి.

* మిగతా స్క్విడ్ల కన్నా భిన్నంగా పందిలాంటి చిత్రమైన ఆకారంతో కార్టూన్‌ బొమ్మలా భలే గమ్మత్తుగా ఉంటుందిది. అందుకే దీనికి ‘బ్యాండెడ్‌ పిగ్‌లెట్‌ స్క్విడ్‌’ అని పేరు.
* చీకటిలో మెరిసిపోయే పారదర్శకమైన తెలుపు రంగులో ఉండే ఈ స్క్విడ్‌ పరిమాణం కేవలం నాలుగు అంగుళాలే.
* దీని కళ్లపై చిన్న చిన్న టెంటకిల్స్‌, తోక భాగంలో ఈకల్లాంటి మొప్పలు ఉంటాయి.
* ఈ బుల్లి స్క్విడ్‌కు మరో ప్రత్యేకతా ఉంది. ఇతర స్క్విడ్లకు లేని విద్య ఒకటుంది. 320 అడుగుల సముద్ర లోతుల్లో ఉండే ఇది పైకీ కిందకీ ఈతకొట్టగలదట.


 

మీకు తెలుసా?

  * స్క్విడ్లకు మూడు గుండెలుంటాయి.
* అతి చిన్న పిగ్మీ స్క్విడ్‌ అంగుళం కన్నా తక్కువ పొడవుంటే, అతి పెద్దది కొలొస్సాల్‌ స్క్విడ్‌ ఏకంగా యాభై అడుగుల పొడవుంటుంది!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని