India W vs Bangladesh W: వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

బంగ్లాదేశ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. 

Published : 30 Apr 2024 20:31 IST

సిల్హెట్‌: బంగ్లాదేశ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. సిల్హెట్‌ వేదికగా జరిగి మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డీఎల్‌ఎస్ పద్ధతిలో విజేతను ప్రకటించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటయ్యింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 5.2 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 47 పరుగులు చేసింది. భారత్‌ ఇన్నింగ్స్‌ జరుగుతున్న సమయంలో వరుణుడు ఆటంకం కలిగించాడు. జల్లులు తగ్గకపోవడం, అప్పటికే ఐదు ఓవర్లు పూర్తవడంతో డీఎల్‌ఎస్‌ పద్ధతిలో విజేతను ఖరారు చేశారు.

భారత్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ షఫాలీ వర్మ (0) పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగింది. స్మృతి మంధాన (5*), దయాళన్‌ హేమలత ( 41*) నాటౌట్‌గా నిలిచారు. అంతకుముందు బంగ్లాదేశ్‌ బ్యాటర్లలో ముర్షిదా ఖతున్‌ (46), రితు మోని (20), మోస్తరే (19) ఆకట్టుకున్నారు. భారత్‌ బౌలర్లలో రాధా యాదవ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ,  శ్రేయాంక పాటిల్‌  తలో 2, పూజా వస్త్రాకర్‌ ఒక వికెట్‌ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని