చకచకా ఎక్కం

మీకు లెవెన్త్‌ టేబుల్‌ వచ్ఛా. ఓ వచ్చు! మిగతా టేబుల్స్‌తో పోల్చుకుంటే 1, 10, 11 ఈ మూడు...

Updated : 13 May 2022 14:39 IST

మీకు లెవెన్త్‌ టేబుల్‌ వచ్ఛా. ఓ వచ్చు! మిగతా టేబుల్స్‌తో పోల్చుకుంటే 1, 10, 11 ఈ మూడు ఎక్కాలు చాలా తేలికగా ఉంటాయి. 11వ ఎక్కం 1, 10 ఎక్కాలంత తేలిగ్గా ఉండదు. 11X 10 = 110 వరకు కాస్త తేలిగ్గానే చెప్పొచ్ఛు కానీ ఒక్కసారిగా 25X11 ఎంత? అని అడిగితే మనం వెంటనే చెప్పలేం. దీనికి ఓ చిట్కా ఉంది. 11X11, 12 X 11, 13X11.. ఇలా ఈ ఎక్కానికి ఈ చిట్కా పనిచేస్తుంది. ఇప్పుడు మనం 25X11 ఎంత వస్తుందో నేర్చుకుందాం. ఇది చదివాక మిగతావి మీరు ప్రయత్నించి చూడండి.

1. ముందుగా 25X 11 అని రాసుకోండి

2. 2+ 5=7 వస్తుంది.

3. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 2, 5 మధ్యలో ఈ ఏడును పెట్టి చూడండి. 275 వస్తుంది.

4. 25X 11= చూడండి సరిగ్గా 275 వస్తుంది.

ఒకవేళ 19X 11, 29X 11... ఇవి చేయాల్సి వస్తే.. 1+ 9, 2+ 9 చేసేటప్పుడు ఫలితం 10,11 వస్తాయి కదా. వీటిలో పదుల స్థానంలో సంఖ్యని అలాగే ఉంచి ముందు స్థానాన్ని మొత్తం ఫలితం యొక్క మొదటి స్థానానికి కలపాలి.

ఉదా: 19X 11 = 1 1+9 9

= 1 10 9

= 2 0 9


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని