Realme: ఎయిర్‌ గెశ్చర్స్‌తో రియల్‌మీ నుంచి బడ్జెట్‌ కొత్త ఫోన్‌

Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ బడ్జెట్‌ ధరలో ఎయిర్‌గెశ్చర్స్‌ సదుపాయంతో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.

Published : 26 Apr 2024 15:39 IST

Realme C65 5G | ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన ‘సి’ సిరీస్‌లో బడ్జెట్‌ ధరలో ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. రియల్‌మీ సీ65 5జీ (Realme C65 5G) పేరిట దీన్ని తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో ఎయిర్‌ గెశ్చర్స్‌ సదుపాయం కూడా ఉంది.

రియల్‌మీ సీ65 5జీ ఫోన్‌ మూడు వేరియంట్లలో వస్తోంది. 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధర 10,499 కాగా.. 4జీబీ +128జీబీ వేరియంట్‌ ధర రూ.11,499గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.12,499గా పేర్కొంది. ఫెదర్‌ గ్రీన్‌, గ్లోయింగ్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తోంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఎర్లీ బర్డ్‌ సేల్‌ అందుబాటులో ఉంటుందని తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన క్రెడిట్‌ కార్డ్‌ సాయంతో కొనుగోళ్లు చేసినవారికి 4జీబీ వేరియంట్‌పై రూ.500, 6జీబీ వేరియంట్‌పై రూ.1,000 డిస్కౌంట్‌ అందించనుంది.

ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. రియల్‌మీ సీ65 5జీ (Realme C65 5G) ఆండ్రాయిడ్‌ 14 (Android 14) ఆధారిత రియల్‌మీ యూఐ 5.0తో పనిచేస్తుంది. 6.67 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 625 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ ఇచ్చారు. డ్యూయల్ కెమెరాతో ఈ ఫోన్‌ వస్తోంది. వెనకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్‌ 15W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. IP54 రేటింగ్‌ కూడా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని