Stock market: 5 రోజుల వరుస లాభాలకు బ్రేక్‌.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 609 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

Published : 26 Apr 2024 16:13 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో వరుస లాభాల్లో దూసుకెళ్లిన మన మార్కెట్లు.. వారాంతంలో నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ, కోటక్‌ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలను పడేశాయి. దీంతో సెన్సెక్స్‌ 600 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ మళ్లీ 22,400 స్థాయికి దిగొచ్చింది.

సెన్సెక్స్‌ ఉదయం 74,509.31 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి వెళ్లింది. ఏ దశలోనూ కోలుకోలేదు సరికదా.. మరింత నష్టాల్లోకి జారుకుంది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో 73,616.65 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 609.28 పాయింట్ల నష్టంతో 73,730.16 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 150 పాయింట్లు నష్టపోయి 22,419.95 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.35గా ఉంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, విప్రో, ఐటీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్, టైటాన్‌ షేర్లు రాణించాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ చమురు ధర 89.34 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని