Shruti Haasan: శ్రుతిహాసన్‌ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?

తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్‌ (Shruti Haasan) బ్రేకప్‌ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Updated : 26 Apr 2024 15:57 IST

హైదరాబాద్‌: నటి శ్రుతిహాసన్‌, దిల్లీకి చెందిన ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారిక ఎంతోకాలం నుంచి రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా వారిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల రీత్యా పరస్పర అంగీకారంతో తమ బంధానికి స్వస్తి పలికారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రుతిహాసన్‌ ఇన్‌స్టాలో ఆయన్ని అన్‌ఫాలో అయ్యారు. శాంతను కూడా ఇప్పుడు ఆమెను ఫాలో కావడం లేదు. తాజాగా ఆమె పోస్ట్‌ పెట్టారు. ‘‘ఇదొక క్రేజీ ప్రయాణం. ఈ ప్రయాణంలో నా గురించి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఇతరుల గురించీ అర్థం చేసుకున్నా.’’ అని పేర్కొన్నారు.

శాంతను అంటే తనకెంతో ఇష్టమని శ్రుతిహాసన్‌ గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. అతడు తన అభిరుచికి విలువ ఇస్తుంటారన్నారు. వీరిద్దరికీ పెళ్లి జరిగిందని సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఓర్హాన్ అవత్రమణి అలియాస్‌ ఓరీ.. కొంతకాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీటిపై స్పందించిన ఆమె సోషల్‌మీడియా వేదికగా ఖండించారు. ‘‘నాకు ఇంకా పెళ్లి కాలేదు. ప్రతీ విషయం గురించి పంచుకునే నేను.. పెళ్లి గురించి ఎందుకు దాస్తాను?’’ అని అన్నారు.

‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’, ‘ది ఐ’, ‘హాయ్‌ నాన్న’, ‘సలార్‌’ వంటి చిత్రాలతో గతేడాది ప్రేక్షకులను అలరించారు నటి శ్రుతిహాసన్‌. ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ‘సలార్‌’లో ఆమె ఆద్యగా కీలకపాత్ర పోషించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దీనికి కొనసాగింపుగా ‘సలార్‌ శౌర్యంగపర్వం’ రానుంది. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. అడివిశేష్‌ హీరోగా రానున్న ‘డకాయిట్‌’లో ఆమె నటిస్తున్నారు. ‘చెన్నై స్టోరీ’లోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని