Ravi Kishan: రవి కిషన్‌కు ఊరట.. డీఎన్‌ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ

భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. 

Updated : 26 Apr 2024 16:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ నటుడు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్‌ (Ravi Kishan) తన తండ్రి అంటూ జూనియర్‌ నటి షినోవా సోనీ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష చేయించాలంటూ ఇటీవల ముంబయి కోర్టును ఆశ్రయించారు. అయితే, తాజాగా ఆమె అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

రవి కిషన్‌ తన భర్త అంటూ కొద్ది రోజుల క్రితం షినోవా తల్లి అపర్ణా సోని లఖ్‌నవూలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అనంతరం ఆ యువతి డీఎన్‌ఏ పరీక్ష కోసం కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తూ..‘‘ఆయన్ను (రవికిషన్‌) నేను అంకుల్ అని పిలుస్తున్నప్పటికీ.. వాస్తవంగా ఆయన నా తండ్రి’’ అని షినోవా చెప్పారు. దీనిపై నటుడి తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. నటుడికి, అపర్ణకు ఎలాంటి సంబంధం లేదని వాదించారు. వారిద్దరికీ ముందునుంచే పరిచయం ఉన్నప్పటికీ, వారి మధ్య ఉన్నది స్నేహబంధమేనని వెల్లడించారు. ఎన్నడూ రిలేషన్‌షిప్‌లో లేరని చెప్పారు. కానీ షినోవా లాయర్ ఇందుకు భిన్నమైన వాదన వినిపించారు.

విజయ్‌ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్‌కు భారత్‌ విజ్ఞప్తి

రవికిషన్, అపర్ణల మధ్య రిలేషన్‌ ఉన్నట్టు ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవన్న కోర్టు.. డీఎన్‌ఏ పరీక్షను తిరస్కరించింది. ఇదిలాఉంటే.. ఈ వివాదంపై ఇదివరకే నటుడి భార్య ప్రీతి స్పందించారు. తమకు రూ.20 కోట్లు ఇవ్వాలని లేదంటే అత్యాచారం కేసులో ఇరికిస్తామంటూ గతేడాది షినోవా, ఆమె తల్లి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. వీరిద్దరితోపాటు సమాజ్‌వాదీ పార్టీ నేత వివేక్‌కుమార్‌ పాండే, యూట్యూబర్‌ ఖుర్షీద్‌ ఖాన్‌ రాజులపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని