స్థిరాస్తుల ధరల్లో సగటున 10 శాతం వృద్ధి

ఇళ్ల ధరలు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 10 శాతం దాకా వార్షిక పెరుగుదల నమోదైంది.

Published : 18 May 2024 00:41 IST

క్రెడాయ్‌- కొలియర్స్‌ నివేదిక
ఈనాడు, హైదరాబాద్‌

ళ్ల ధరలు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 10 శాతం దాకా వార్షిక పెరుగుదల నమోదైంది. ఇళ్ల విక్రయాలు బాగుండటంతో ధరల్లో వృద్ధి కన్పిస్తోందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. పెరుగుదల తక్కువలో తక్కువ 4 శాతం ఉంటే.. గరిష్ఠంగా 19 శాతం పెరిగాయి అని క్రెడాయ్, కొలియర్స్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్‌ పెరగడం, మౌలిక వసతుల ప్రాజెక్టులు రాబోతుండటం, కొత్త నివాస ప్రాజెక్ట్‌ల ప్రారంభాలతో ధరల్లో వృద్ధి కన్పించిందని నివేదికలో తెలిపింది.

  • బెంగళూరులో స్థిరాస్తుల ధరలు భారీగా పెరిగాయి. ఇక్కడ పెరుగుదల అత్యధికంగా 19 శాతం ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో సగటు చదరపు అడుగు ధర రూ.10,377గా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో చ.అ.ధర రూ.8,748 మాత్రమే. 
  • ధరల పెరుగుదల పరంగా బెంగళూరు తర్వాత దిల్లీ, హైదరాబాద్, పుణె నగరాలు ఉన్నాయి. 
  • దిల్లీ రాజధాని ప్రాంతంలో పెరుగుదల 16 శాతంగా ఉంది. ఇక్కడ చ.అ.రూ.9,757కి పెరిగింది. 
  • అహ్మదాబాద్, పుణెలలో 13 శాతం ధరలు పెరిగాయి. ఇక్కడ చ.అ. ధర రూ.7,156, రూ.9,448గా ఉన్నాయి. 
  • ముంబయిలో చ.అ. ధర రూ.20,361గా ఉంది. ఇక్కడ 6 శాతం ధరలు పెరిగాయి. 
  • కోల్‌కతాలో ఏడు శాతం ధరలు పెరిగాయి. చ.అ.ధర రూ.7727కి చేరింది. 
  • చెన్నైలో చదరపు అడుగు ధర రూ.7710గా ఉంది. ఇక్కడే అతి తక్కువగా 4 శాతం పెరిగాయి. 

హైదరాబాద్‌లో ఇలా.. 

సిటీలో ధరలు గత ఏడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఈసారి 9 శాతం పెరిగాయి. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.11,323కి చేరిందని క్రెడాయ్‌-కొలియర్స్‌ నివేదిక పేర్కొంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని