మనశ్శాంతి ఎలా?

Published : 06 Jun 2024 00:12 IST

త్మానందం కలగాలన్నా, మనశ్శాంతి లభించాలన్నా, మనలో కొంత వైరాగ్య భావన, ఉన్నదాంతో ఆత్మసంతృప్తి చెందే ధోరణి ఉండాలని పెద్దలు చెబుతారు. వైరాగ్యమంటే సన్యసించడమో, అన్నిటి మీదా విరక్తి¨ చెందడమో కాదు. తామరాకు మీద నీటిబొట్టులా ఉండటం. మనకు ఎంత ప్రాప్తమో అంత, దక్కని వాటి గురించి దుఃఖించనవసరం లేదనే పరిపక్వత. అలా లేకుంటే.. వైఫల్యాలు ఎంతగానో కుంగదీస్తాయి. భరతుడు అపరాధ భావనతో శ్రీరాముడికి చెందవలసిన రాజ్యాన్ని అప్పగించడానికి వచ్చినప్పుడు- వైరాగ్య భావన చాలా అవసరం అంటూ శ్రీరాముడు ఇలా ఉద్బోధిస్తాడు..

సర్వ క్షయాంతాః నిచయాః పతనాంతాః సముచ్ఛయాః
సంయోగా విప్రయోగాంతా మరణాంతం జీవితమ్‌

మనం సాధించిన ఈ ధనరాశులన్నీ ఏదో ఒకరోజు పతనమైపోతాయి. ఈ కలయికలు శాశ్వతం కావు. జీవితం ఎప్పుడూ మరణంతోనే పూర్తవుతుంది- అనేది ఈ శ్లోకానికి అర్థం. అందువల్ల అశాశ్వతమైన లౌకిక విషయాల కోసం మనసును పాడుచేసుకోకూడదు.. సహనాన్ని అలవరచుకుని, వైరాగ్య భావనతో, ఆత్మసంతృప్తితో జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని గ్రహించాలి.

చల్లా పద్మప్రియ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని