సాధువు కత్తి!

ఓ ఆధ్యాత్మిక సాధకుడు ఎన్నో ఏళ్లుగా దట్టమైన అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. అతడి తపోదీక్ష సాగుతుండగా.. దేవేంద్రుడు అతణ్ణి పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు ఆ మునీశ్వరుడి ముందు ప్రత్యక్షమై, ఒక ఖడ్గాన్ని ఇచ్చి.. ‘మునివర్యా! నేను పని మీద వెళ్తున్నాను.

Published : 06 Jun 2024 00:13 IST

ఆధ్యాత్మిక సాధకుడు ఎన్నో ఏళ్లుగా దట్టమైన అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. అతడి తపోదీక్ష సాగుతుండగా.. దేవేంద్రుడు అతణ్ణి పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు ఆ మునీశ్వరుడి ముందు ప్రత్యక్షమై, ఒక ఖడ్గాన్ని ఇచ్చి.. ‘మునివర్యా! నేను పని మీద వెళ్తున్నాను. తిరిగొచ్చే వరకూ దీన్ని పదిలపరచండి. కొన్నాళ్ల తర్వాత తీసుకుంటాను’ అన్నాడు. మహర్షి అందుకు సమ్మతించి ఇంద్రుడి ఖడ్గాన్ని తీసుకున్నాడు. దాన్ని రక్షించేందుకు ముని నిరంతరం తనతోనే ఉంచుకునేవాడు. ఎక్కడికెళ్లినా కరవాలాన్ని నడుముకి ధరించేవాడు. సాధన నుంచి ఆయన మనసు కరవాలం మీదికి మరలింది. అంతేకాదు.. చేతిలో ఆయుధం ఉండేసరికి మధ్య మధ్యలో ఏమీ తోచక చెట్ల కొమ్మల్ని నరకటం, ఫలాల్ని కోయటం పనిగా పెట్టుకున్నాడు. దేవేంద్రుడు తిరిగొచ్చేసరికి.. ఖడ్గం ప్రభావంతో అతడి ప్రవృత్తే మారిపోయింది. సాత్వికుడు కాస్తా రాజసికుడిగా మారాడు. ఇది రామాయణంలో సీతాదేవి చెప్పిన కథ. చెంతనున్న వస్తువులు మన మనసుపై ప్రభావాన్ని చూపుతాయనే హెచ్చరిక ఇది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పుడు ప్రతికూలతను చూపే వ్యక్తులకే కాదు, వస్తువులకూ దూరంగా ఉండాలని, సాంగత్య ప్రభావంతో మనసు మారిపోతుందని మన ధర్మగ్రంథాలు ప్రబోధిస్తున్నాయి.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని