సౌమ్యనాథుడి దర్శనం... మహదానందభరితం
జులై 5న సౌమ్యనాథస్వామి ఉత్సవాలు ప్రారంభం

అన్నమయ్య జిల్లా నందలూరులో బాహుదా నది తీరాన సౌమ్యనాథస్వామి ఆలయం ఉంది. ఇది అతి పురాతన ఆలయం. గర్భాలయంలో స్వామివారి విగ్రహం ఏడడుగుల ఎత్తులో ఉంటుంది. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య కొంతకాలం ఇక్కడే ఉండి పలు సంకీర్తనలు రచించినట్లు చరిత్ర చెబుతోంది. చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించగా.. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు గాలి గోపురం కట్టించాడు. అనంతరం పాండ్య రాజులు ఆలయాన్ని పునరుద్ధరించారు. సౌమ్యనాథస్వామి ఆలయం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. సంతానం లేనివారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. జులై 5 నుంచి 14 వరకూ తితిదే ఆధ్వర్యంలో సౌమ్యనాథస్వామి వారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి దిలీప్ తెలియజేశారు. జులై 5న ధ్వజారోహణం, 11న శ్రీదేవి-భూదేవి సమేత సౌమ్యనాథస్వామి కల్యాణం, 12న రథోత్సవం జరగనున్నాయి. 14న పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. నందలూరు ఆలయం కడప నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి బస్సులు, ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉంటాయి.
ఇనుకొండ పెద్దబాబయ్య, ఈనాడు, కడప
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 


