‘అష్ట’ గుణాలు

Eenadu icon
By Features Desk Published : 03 Aug 2025 15:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

భారతీయ సంప్రదాయం శ్రీమహాలక్ష్మిని అష్టలక్ష్మిగా ఆరాధిస్తుంది. ఎనిమిది రూపాలూ లక్ష్మీతత్వానికి ఎనిమిది కోణాలు. లక్ష్మీకటాక్షాన్ని సాధించడానికి ఎనిమిది సోపానాలు కూడా. ఆదిలక్ష్మి... సంకల్ప బలానికి ప్రతీక. విశ్వకుబేరుడి ప్రయాణమైనా ఒక్క రూపాయితోనే మొదలవుతుంది. లక్ష్యాన్ని సాధించగలననే ఆ మనోబలంలో ‘ఆదిలక్ష్మి’ కొలువై ఉంటుంది. అవరోధాల్ని అధిగమించి కలను నిజం చేసుకోడానికి సాధకుడు సాగించే ప్రయాణంలో ‘ధైర్యలక్ష్మి’ అండగా నిలుస్తుంది. అలా అని, ఆ ఒక్కటే సరిపోదు, విజయ సాధనకు నైపుణ్యమూ కావాలి. 

ఆ మేధస్సును ‘విద్యాలక్ష్మి’ అందిస్తుంది. బలమైన శరీరంలోనే బలమైన మనసు ఉంటుంది. అంతటి సత్తువ ఆహారంతోనే వస్తుంది. ‘ధాన్యలక్ష్మి’ భోజనం రూపంలో శారీరక దృఢత్వాన్ని ఇస్తుంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధన సంపత్తితో మనం సాగించే పోరాటం మనల్ని గెలుపు వైపు నడిపిస్తుంది. ‘విజయలక్ష్మి’ మహాప్రసాదమిది. ఆ అర్హతతో మనదైన రంగంలో, మనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాం. దానికి అధిదేవత ‘గజలక్ష్మి’. ఆమెను సామ్రాజ్య లక్ష్మిగానూ పిలుస్తారు. ఆ వెనువెంటనే ‘ధనలక్ష్మి’ కరుణిస్తుంది. తదుపరి దశ... విస్తరణ. ఒక ఎకరం నుంచి పది ఎకరాలకూ, ఒక లక్ష నుంచి వెయ్యి లక్షలకూ, ఒక పట్టా నుంచి రెండు పట్టాలకూ... ఒక వ్యక్తి నుంచి ఒక కుటుంబానికి! సంతానలక్ష్మి పిల్లాపాపల్లాంటి కీర్తి వైభోగాల్ని కటాక్షిస్తుంది. బంధు బలగాల్ని సమకూరుస్తుంది. అలా ఎనిమిది దశల్లో మనం జీవిత లక్ష్యాన్ని సాధిస్తాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని