ప్రేమాభిమానాల పౌర్ణమి

Eenadu icon
By Features Desk Published : 07 Aug 2025 02:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఆగస్టు 9 రాఖీ పండుగ

రాఖీపౌర్ణమి - రక్షాబంధన్‌ అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అనీ అంటారు. తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీకి.. మన పురాణేతిహాసాల్లో చక్కని ప్రాధాన్యం ఉంది. 
శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుడి చూపుడు  వేలికి గాయమై రక్తం ధారగా కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి కృష్ణుడి వేలికి కట్టు కడుతుంది. దాంతో శ్రీకృష్ణుడు దానికి కృతజ్ఞతగా   ద్రౌపదికి ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుంచి కాపాడతాడు. 
పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం    జరిగింది. అందులో ఓడిపోయిన దేవేంద్రుడు నిర్వీర్యుడై, తన       పరివారంతో అమరావతిలో తల        దాచుకుంటాడు. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి      తరుణోపాయం ఆలోచిస్తుంది. సరిగ్గా శ్రావణపౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి... దేవేంద్రుడి చేతికి రక్ష కడుతుంది. అది గమనించిన  దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి సమరానికి   పంపుతారు. ఆ యుద్ధంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. అలాగే బలి చక్రవర్తి కోరిక మేరకు     శ్రీమహావిష్ణువు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. లక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి, తన భర్తను వైకుంఠానికి  తీసుకొస్తుంది. ఆ రక్షాబంధనమే నేడు రాఖీ పండుగగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. 
బిడ్డలు కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లకు రక్షగా నిలవాలి. ఆడపడుచులు ప్రేమానుబంధాలు నిలపాలనే ఆశలతో చేసుకునేదే ఈ పండుగ.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని