Kamika Ekadasi: మోక్షం ప్రసాదించే కామిక ఏకాదశి

ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. పేరుకు తగ్గట్లే ఈ ఏకాదశి మనసులోని కోరికలను సిద్ధింపచేస్తుంది. ఇది శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి కావడం వలన పవిత్రంగా భావించి స్వామిని పూజిస్తారు. కామిక ఏకాదశి నాడు పాలు ఇచ్చే గోవును దూడతో సహా, గ్రాసం కలిపి దానం చేస్తే సమస్త దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ రోజు ఉపవాసం ఉండటం, జాగరణ చేయడం, వెన్నను దానం చేయడం, తులసిమొక్క వద్ద నేతిదీపం వెలిగించటం శ్రేష్ఠం. కామిక ఏకాదశి విశిష్టత గురించి బ్రహ్మదేవుడు నారదుడికి, శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్టు పౌరాణిక కథనాలున్నాయి. ఈ రోజు తులసి ఆకులతో విష్ణువును పూజిస్తే సర్వపాపాల నుంచి విముక్తులవుతారు, మోక్షం లభిస్తుంది- అన్నది పురాణ వచనం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


