ఈ క్యాట్‌వాక్‌ కథే వేరు

మోడళ్ల క్యాట్‌వాక్‌లు.. డిజైనర్లు తమ సత్తా చూపిస్తూ రూపొందించిన డిజైన్లు.. బోలెడు వ్యాపార అవకాశాలు.. ఫ్యాషన్‌ షో అంటే గుర్తొచ్చేవివే. కానీ గతవారం జరిగిన లాక్మే....

Published : 09 Apr 2016 01:24 IST

ఈ క్యాట్‌వాక్‌ కథే వేరు

మోడళ్ల క్యాట్‌వాక్‌లు.. డిజైనర్లు తమ సత్తా చూపిస్తూ రూపొందించిన డిజైన్లు.. బోలెడు వ్యాపార అవకాశాలు.. ఫ్యాషన్‌ షో అంటే గుర్తొచ్చేవివే. కానీ గతవారం జరిగిన లాక్మే ఫ్యాషన్‌వీక్‌లో అంతకుమించి విశేషం చోటుచేసుకుంది. ప్రముఖ వ్యాపార సంస్థ తన ఆన్‌లైన్‌ పోర్టల్‌ ప్రారంభించిన సందర్భంగా ఏరికోరి మరీ ఐదురంగాలకు చెందినవారితో ప్రత్యేకంగా క్యాట్‌వాక్‌ నిర్వహించింది. సొగసుకు ఏ పట్టింపు లేదని నిరూపించారు ఆ ఐదుగురు.

లక్ష్మీనారాయణ్‌ త్రిపాఠి: హిజ్రా, సామాజిక కార్యకర్త. ఫ్యాషన్‌ ఆదరించడానికి జెండర్‌ పట్టింపులు అవసరం లేదని చెప్పడానికి అతడు, ఆమె ఈ షోలో పాల్గొంది.

హెలెన్‌: బాలీవుడ్‌లో ప్రత్యేక నృత్యగీతాల్లో నర్తించి ఒకప్పుడు దేశాన్ని ­పేసిన డ్యాన్సర్‌. డెబ్భై ఏడేళ్ల వయసులోనూ ఉత్సాహంగా క్యాట్‌వాక్‌ చేసి స్టైల్‌కి వయసుతో పని లేదని నిరూపించింది హెలెన్‌.

భారతీసింగ్‌: నేటి అమ్మాయిలంతా సైజ్‌ జీరోల యావలో కొట్టుకుపోతుంటే.. ఫ్యాషన్‌కి సైజుతో సంబంధం లేదని చెప్పడానికి ఈ స్టాండప్‌ కమెడియన్‌ క్యాట్‌వాక్‌ చేసి అలరించింది.

సన్నీ లియోని: అనుకోకుండా నీలి చిత్రాల తారగా మారి, ప్రస్తుతం బాలీవుడ్‌లో దూసుకుపోతున్న నటి. ఎంచుకున్న అవకాశం ఎలాంటిదైనా.. వారూ ఫ్యాషన్‌గా ఉండటానికి అర్హులే అని చెప్పడానికి లాక్మే ఫ్యాషన్‌వీక్‌లో హొయలొలికించి కుర్రాళ్లను ఆకట్టుకుంది.

సుమన్‌ శర్మ: రష్యాకు చెందిన మిగ్‌-35 ఫైటర్‌ విమానం నడిపిన తొలి మహిళ. ఎంచుకున్న రంగం ఏదైనా సొగసుగా ఉండటానికి అది అడ్డుకాదని చెప్పడానికే తాను ఈ ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొన్నానని ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని