London: భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు

భారత్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో లండన్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. 

Published : 30 Apr 2024 17:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. భారత్‌కు చెందిన సాహిల్ శర్మ(24) మెహక్‌ (19)కు గతేడాది వివాహం జరిగింది. వివాహం అనంతరం దంపతులు లండన్‌లోని క్రోయిడాన్‌లో నివాసముంటున్నారు.  ఈక్రమంలోనే సాహిల్‌ తన భార్యను కత్తితో దారుణంగా హత్య చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసిన సాహిల్‌ పోలీసులకు సమాచారం అందించాడు. రక్తపు మడుగులో పడి ఉన్న మెహక్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

కత్తితో విచక్షణారహిత దాడి..ఉలిక్కిపడిన లండన్‌

నిందితుడిని అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో న్యాయస్థానం ఎదుట తన భార్యను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అయితే, ఈ నేరానికి పాల్పడడానికి గల కారణాలను వెల్లడించలేదు. ఈ కేసులో లండన్‌ కోర్టు విచారణ చేపట్టి తాజాగా తీర్పు వెలువరించింది. దోషిగా తేలిన సాహిల్‌కు జీవిత ఖైదును విధించింది. ఒకవేళ అతడు పెరోల్‌ పొందాలనుకుంటే అందుకు కనీసం 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని