T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..

జూన్‌ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తమ జట్లను ప్రకటించాయి. 

Updated : 30 Apr 2024 16:42 IST

ఇంటర్నెట్ డెస్క్: జూన్‌ 2 నుంచి యూఎస్ఏ, వెస్టిండీస్‌ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 (T20 World Cup 2024) ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతుండటంతో ఆయా దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించగా.. తాజాగా ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తమ జట్ల వివరాలను వెల్లడించాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఇంగ్లాండ్‌ను జోస్ బట్లర్ ముందుండి నడిపించనున్నాడు. గాయం కారణంగా కొన్ని నెలలుగా ఆటకు దూరమైన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా అర్చర్ పొట్టి ప్రపంచకప్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. 

ఇక సౌతాఫ్రికా విషయానికొస్తే ఐడెన్ మార్‌క్రమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐసీసీ ఈవెంట్‌లో మార్‌క్రమ్‌ కెప్టెన్సీ చేపట్టడం ఇదే మొదటిసారి. SAటీ20 టోర్నమెంట్‌లో అదరగొట్టిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు ర్యాన్ రికెల్టన్, ఒట్నీల్ బార్ట్‌మాన్‌ను ప్రపంచకప్‌నకు ఎంపిక చేశారు. 530 పరుగులతో రికెల్టన్ SAటీ20లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బార్ట్‌మాన్‌ 8 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. 

ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోకియా, వికెట్‌కీపర్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇటీవల ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ జాబితాలో వీరిద్దరికి చోటు దక్కలేదు. నోకియా వెన్ను గాయం కారణంగా సెప్టెంబర్ 2023 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. డి కాక్ 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు 2022లో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 

దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కొయెట్జీ, క్వింటన్ డి కాక్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోకియా, కగిసో రబాడ, తబ్రెయిజ్‌ షంసి, ట్రిస్టన్ స్టబ్స్.

ట్రావెలింగ్ రిజర్వ్: నంద్రి బర్గర్, లుంగి ఎంగిడి. 

ఇంగ్లాండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్‌), మొయిన్ అలీ, జోఫ్రా అర్చర్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, అదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్. 

న్యూజిలాండ్‌ జట్టు: విలియమ్సన్‌, ఫిన్‌ అలెన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బ్రాస్‌వెల్‌, చాప్‌మన్‌, డేవాన్ కాన్వే, ఫెర్గూసన్‌, మ్యాట్‌ హెన్రీ, డరిల్‌ మిచెల్‌, నీషమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, మిచెల్ శాంట్నర్‌, ఇష్‌ సోధి, టిమ్‌ సౌథీ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని