విడాకుల లెక్క తేలేదెలా?

ఒకరిపై ఒకరు మనసు పడ్డారు.. మనువాడకుండానే సహజీవనం చేశారు.. పిల్లలు పుట్టాక పెళ్లాడారు.. బాలీవుడ్‌ స్టార్లు ఏంజెలినా జోలీ...

Published : 01 Oct 2016 01:27 IST

విడాకుల లెక్క తేలేదెలా?

ఒకరిపై ఒకరు మనసు పడ్డారు.. మనువాడకుండానే సహజీవనం చేశారు.. పిల్లలు పుట్టాక పెళ్లాడారు.. బాలీవుడ్‌ స్టార్లు ఏంజెలినా జోలీ, బ్రాడ్‌పిట్‌ల ప్రతి అడుగూ సంచలనమే. తాజాగా వారిద్దరి విడాకుల తతంగం అంతకన్నా పెద్ద కథై కూర్చుంది. ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసే వార్తైంది. విడాకుల లెక్క తేలాలంటే తేలాల్సినవి ఎన్నో ఉన్నాయంటున్నారు న్యాయవాదులు. ఆ వివరాలివి.

ఆస్తులు
పెళ్లంటే మూడు ముళ్లు.. ఏడడుగులు.. నూరేళ్ల జీవితం అనుకోవడానికి వాళ్లేం మనలాంటోళ్లేం కాదు! హాలీవుడ్‌ సెలెబ్రెటీలు. వాళ్ల దృష్టిలో పెళ్లంటే పక్కాగా లెక్కలే. ఏంజెలినా, బ్రాడ్‌పిట్‌ల ఉమ్మడి సంపాదన విలువ అక్షరాలా 27 వేల కోట్లు. బ్రాడ్‌పిట్‌ సంపాదన 16 వేల కోట్లైతే ఏంజెలినా పోగేసింది 11 వేల కోట్లు.

స్థిరాస్తులు
దత్తత తీసుకున్న పిల్లలు, తమకు పుట్టిన పిల్లల కోసం పిట్‌ హాలీవుడ్‌లో విశాలమైన భవంతి నిర్మించాడు. తాము ఏకాంతంగా ఉండటానికి ఆ పక్కనే ఉన్న కాలిఫోర్నియాలో మరో ఇల్లు కొన్నాడు. ఈ రెండింటి విలువ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలుంటుంది. ఈ జంట ముచ్చటపడి కొనుగోలు చేసిన మరో సౌధం ఫ్రాన్స్‌లోని చాటెయు మిరావల్‌లో ఉంది. వెయ్యి ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 35 పడకల గదులున్న ఈ విలాసవంతమైన నివాసం విలువ రూ.333 కోట్లు. న్యూఓర్లియన్స్‌లో ఉన్న ఇంటి విలువ రూ.40 కోట్లుగా లెక్కకట్టారు. మరో ఇరవై కోట్లతో టర్కీలోని మజోర్కాలో ఈమధ్యే ఓ విల్లా కొనుగోలు చేశారు.

పిల్లలు
జోలీకి మాజీ ప్రియుడితో ఒకబ్బాయి పుట్టాడు. తర్వాత ముగ్గుర్ని దత్తత తీసుకుంది. పన్నెండేళ్ల కిందట పిట్‌, జోలీ మనువాడాక ఇద్దరు వారసులు వచ్చారు. పిట్‌ ముగ్గురు దత్తత పిల్లల్ని తన వారసులేనని ఆమోదం తెలిపాడు. ఇప్పుడు జోలీ పిట్‌ నుంచి భరణం కోరడం లేదు. కానీ పిల్లలంతా నా దగ్గరే ఉండాలంటోంది. దీనిపైనే కోర్టుకెక్కుతానంటున్నాడు పిట్‌. సంతానం, ఆస్తుల లెక్క తేలడం అంత తేలిక కాదంటున్నారు న్యాయవాదులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు