logo

జైలుకు పోతానన్న భయంతో జగన్‌ లండన్‌కు: సీఎం రమేశ్‌

ముఖ్యమంత్రి జగన్‌ ఘోరంగా ఓడిపోతారని తెలిసి, జైలుకు పోతారన్న భయంతో లండన్‌కు వెళ్లిపోతున్నారని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ అన్నారు.

Updated : 10 May 2024 08:48 IST

ఎలమంచిలి ర్యాలీలో ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ తదితరులు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ ఘోరంగా ఓడిపోతారని తెలిసి, జైలుకు పోతారన్న భయంతో లండన్‌కు వెళ్లిపోతున్నారని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ అన్నారు. గురువారం సాయంత్రం ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌తో కలిసి ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో రెండు వేల బైక్‌లతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీ పార్టీ కార్యాలయం నుంచి పాతజాతీయ రహదారి మీదుగా పుర వీధుల్లో సాగింది. ధర్మవరం, ఎర్రవరం, రేగుపాలెం గ్రామాల్లో కలియతిరిగింది. ఈ సందర్భంగా ధర్మవరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రమేశ్‌ మాట్లాడుతూ ఘోరంగా ఓడిపోతానని జగన్‌కు తెలిసిపోయిందని, జైలుకు పోతానన్న భయంతో లండన్‌ వెళ్లిపోవడానికి వీసా తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కూటమికి ఎదురులేదని ఆయనకు తెలిసిపోయిందన్నారు. ముఖ్యమంత్రి పదవి పోయిన వెంటనే జగన్‌ జైలుకు పోవడం ఖాయమన్నారు. కూటమి అధికారంలోకి రాగానే నెలకు రూ. 4 వేలు పింఛను ఇస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందన్నారు. ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్‌ సిలెండర్లు ఇస్తారన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను చూసి భయపడిపోయిన జగన్‌ ఇవన్నీ ఇవ్వలేమని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆడపడుచులంతా కూటమి వెంటే ఉన్నారని, రాక్షస పాలన పోవాలంటే జగన్‌ని చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలన్నారు. జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ గాజుగ్లాస్‌, కమలం గుర్తులపై ఓటేసి కూటమి అభ్యర్థులైన తమ ఇద్దరినీ గెలిపించాలన్నారు. ఎంతమంది చదువుకుంటే అంతమందికి వారి తల్లుల ఖాతాలో కూటమి ప్రభుత్వం డబ్బులు వేస్తుందన్నారు. నాయకులు ప్రగడ నాగేశ్వరరావు, పప్పల చలపతిరావు, బొద్దపు శ్రీను, గొర్లె నానాజీ, పిట్టా శ్రీనులు మాట్లాడుతూ విజయ్‌కుమార్‌, సీఎం.రమేశ్‌లను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కన్నబాబు పాలనకు చరమగీతం పాడాలన్నారు. వీరికి అడుగడుగునా మహిళలు హారతులు పట్టారు. ర్యాలీలో భాగంగా ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. ధర్మవరంలో వీరిద్దరినీ కొఠారు సాంబశివరావు, కొఠారు నరేష్‌, కాకివాని వీధిలో ఓగిబోయిన చిరంజీవి  సత్కరించారు. కూటమి నాయకులు దాడి గంగాధర్‌, లాలం సోమినాయుడు, పల్లా సత్యనారాయణ, నైదాన రమేశ్‌, ఊడి బాబులు, కరణం రవికుమార్‌, సాంబ, గుర్రాల శేఖర్‌, పప్పు ఈశ్వరరావు, ఆడారి రమణబాబు, గంధం శివ, నగిరెడ్డి కాసుబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని