logo

వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం

డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతిని కలిసిన వ్యక్తిని దుండగులు భయపెట్టి రూ.60వేలతో పరారైన ఘటన ఫిల్మ్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...

Updated : 10 May 2024 09:47 IST

సినీ ఫక్కీలో యువకుడి కారు ఎక్కి.. బెదిరింపులు

ఫిల్మ్‌నగర్‌: డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతిని కలిసిన వ్యక్తిని దుండగులు భయపెట్టి రూ.60వేలతో పరారైన ఘటన ఫిల్మ్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... విజయనగర్‌కాలనీకి చెందిన అజిత్‌ కె ఇమ్మాన్యుయెల్‌ ఈనెల 6న   ‘మసాజ్‌ రిపబ్లిక్‌’ అనే డేటింగ్‌యాప్‌ చూసి, వాట్సాప్‌ ద్వారా ఓ యువతితో చాటింగ్‌ చేశాడు. అదే రోజు సాయంత్రం గోల్కొండ ప్రాంతానికి యువతిని కలిసేందుకు కారులో వెళ్లాడు. అనంతరం ఇద్దరూ కారులో వెళ్దామనుకుంటుండగా ముగ్గురు వచ్చి కారులో ఎక్కారు. ఇంతలో యువతి జారుకుంది. ‘మీరు వ్యభిచారం చేయడానికి వచ్చారు కదా..’ అంటూ అతడిని బెదిరించారు. పోలీసుల వద్దకు తీసుకెళ్తామని కేసులు నమోదు చేయిస్తామని, మీడియాకు తెలియజేసి బండారం బహిర్గతం చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వదిలేయాలంటే రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భయాందోళనకు గురైన ఇమ్మాన్యుయెల్‌ చేసేది లేక తన ఖాతాలో ఉన్న రూ.60వేలను వారి వద్ద ఉన్న క్యూఆర్‌ కోడ్‌కు స్కాన్‌ చేసి బదిలీ చేశారు. అతని కారులోనే మణికొండ వైపు ప్రయాణించి రోడ్డు పక్కన కారు ఆపి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో ఫిల్మ్‌నగర్‌ పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని