Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 May 2024 09:04 IST

1. ఈ అరాచకాల్ని.. ఆపేదెవరు..?

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల సమయమే ఉంది. శనివారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. సోమవారం పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో పల్నాడులో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కత్తిమీదసాములా మారింది. ప్రచార సమయంలో ఇక్కడ తెదేపా, వైకాపా మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. పూర్తి కథనం

2. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం

మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు.. నిర్మాణ సంస్థ ‘ఎల్‌అండ్‌టీ’నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. తాము పని చేసిన ప్రాజెక్టులలో ఎక్కడా వైఫల్యం చెందలేదని ఎల్‌అండ్‌టీ.. ఉత్తరాఖండ్‌లో దాఖలు చేసిన ఓ టెండర్‌లో  ధ్రువీకరణ (అండర్‌ టేకింగ్‌) ఇచ్చింది. అందులో మేడిగడ్డ గురించి కూడా ప్రస్తావించింది. పూర్తి కథనం

3. జైలుకు పోతానన్న భయంతో జగన్‌ లండన్‌కు..

ముఖ్యమంత్రి జగన్‌ ఘోరంగా ఓడిపోతారని తెలిసి, జైలుకు పోతారన్న భయంతో లండన్‌కు వెళ్లిపోతున్నారని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ అన్నారు. గురువారం సాయంత్రం ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌తో కలిసి ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో రెండు వేల బైక్‌లతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీ పార్టీ కార్యాలయం నుంచి పాతజాతీయ రహదారి మీదుగా పుర వీధుల్లో సాగింది.పూర్తి కథనం

4. ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్‌!

ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్‌ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్‌ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఏపీకి ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్‌ అయిపోయాయి. దీంతో టీఎస్‌ఆర్టీసీ గురువారం అదనంగా మరో 160 సర్వీసులను ఆన్‌లైన్‌లో పెట్టింది. పూర్తి కథనం

5. ఫ్యాన్‌ మీట నొక్కాలంటే వణుకు

అధికారంలోకి వచ్చిన తర్వాత జనం ఇక పనేముందన్నట్లు వ్యవహరించారు. పాదయాత్ర వేళ ఇచ్చిన హామీకి నిలువునా పాతరేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సర్దుబాటు ఛార్జీల పేరుతో బాదుడు ప్రారంభించారు. అదే పనిగా బిల్లులు పెంచి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారు. స్లాబుల మార్పు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, స్థిర ఛార్జీలు, విద్యుత్తు సుంకం, ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో ప్రతి నెలా వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు.పూర్తి కథనం

6. జానెడు రోడ్డేయలేని ఎమ్మెల్యే అవసరమా?: సునీత

వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డికి పరాజయం తప్పదు. వైసీపీ నాయకులు తెదేపాలోకి కొనసాగుతున్న వలసలే ఓటమికి సంకేతమని మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ పేర్కొన్నారు. గురువారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో 85 కుటుంబాలు పార్టీలోకి చేరారు. వారందరికీ తెదేపా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.పూర్తి కథనం

7. అరాచక పాలకులు మనకొద్దు: రఘురామ

అరాచక పాలకులు మనకొద్దని.. సార్వత్రిక ఎన్నికల తర్వాత జగన్‌ను రాజకీయాలకు శాశ్వతంగా దూరం చేద్దామని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. మహదేవపట్నం గ్రామంలో తెదేపా మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, సర్పంచి వనిమా నాగ వెంకట సుబ్బలక్ష్మి, జనసేన మండల అధ్యక్షుడు యడవల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.పూర్తి కథనం

8. అధ్యక్షా.. ఆమదాలవలసకు ఏం చేశారు?

శాసనసభ సభాపతి అంటే ముఖ్యమంత్రి సైతం అధ్యక్షా అని పిలిచే పదవి. అంతటి హోదాలో ఉన్న వ్యక్తి నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలి. ఐదేళ్ల పాలనలో స్వలాభం పైనే ధ్యాస పెట్టారు..  అభివృద్ధి ఊసే మరిచిపోయారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. ప్రజలు, ముఖ్య అనుచరులు, మండల, గ్రామ స్థాయి నేతలు ఆయన వైఖరిని ఎండగట్టినా తీరు మార్చుకోలేదు.పూర్తి కథనం

9. వికసిత్‌ కాదు.. విఫల భారత్‌!

‘మోదీ పదేపదే చెప్పే వికసిత భారత్‌.. విఫల భారత్‌ అయింది. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ కూడా సత్యనాశ్‌ అయింది’’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. గురువారం రాత్రి కరీంనగర్‌లో కరీంనగర్‌ భారాస లోక్‌సభ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్‌లో కేసీఆర్‌ మాట్లాడుతూ పదేళ్ల మోదీ పాలనతో పాటు, నాలుగు నెలల కాంగ్రెస్‌ పాలనపై మండిపడ్డారు.పూర్తి కథనం

10. మేనత్తను అవమానిస్తే ఆనందిస్తారా?

కాంగ్రెస్‌ నాయకులు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని భాజపా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. గురువారం ధన్వాడలో కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన కార్నర్‌ సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మహిళనన్న కనీస గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా దూషిస్తున్నారని మండిపడ్డారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని