గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!

గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది.. జగన్‌ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు.

Updated : 10 May 2024 09:19 IST

జగన్‌ రివర్స్‌ పాలనలో చెట్లపై ప్రతాపం

పిఠాపురం, న్యూస్‌టుడే: గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది.. జగన్‌ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల 11న ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రెండ్రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అగ్నిమాపక కార్యాలయం నుంచి సభ నిర్వహించే బంగారమ్మ రావిచెట్టు వరకూ రోడ్డు మధ్యలో డివైడర్‌పై ఉన్న చెట్ల కొమ్మలు నరికేస్తున్నారు. చిన్నమాంబ పార్కు ప్రహరీ పక్కన ఉన్న చెట్లు సైతం తొలగిస్తున్నారు. ఏళ్ల తరబడి దాతలసాయంతో పెంచిన మొక్కలు ముఖ్యమంత్రి సభ కోసం నరికేయడంపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పిఠాపురంలో ఉన్న ఒకే ఒక్క క్రీడామైదానంలోనే హెలిప్యాడ్‌ ఏర్పాటుచేయడంతో రెండు రోజులుగా క్రీడాకారుల సాధనకూ బ్రేక్‌ పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని