ఎన్టీఆర్‌ వర్సిటీ స్నాతకోత్సవం వాయిదా

ఈనెల 8న నిర్వహించాల్సిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వాయిదా పడింది. వర్శిటీ నిధులను ప్రభుత్వ సంస్థకు మళ్లించడాన్ని వ్యతిరేకిస్తూ....

Published : 05 Dec 2021 05:16 IST

ఉద్యోగులతో ఫలించని చర్చలు

ఈనాడు, అమరావతి-ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఈనెల 8న నిర్వహించాల్సిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వాయిదా పడింది. వర్శిటీ నిధులను ప్రభుత్వ సంస్థకు మళ్లించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆందోళనబాట పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  వాస్తవానికి 2019-20, 2020-21 రెండేళ్ల స్నాతకోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. చాలామంది ప్రముఖులను ఆహ్వానించారు. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలతో వాయిదా వేయాల్సి వచ్చింది. శనివారం ఉద్యోగ ఐకాస నాయకులతో చర్చించిన రిజిస్ట్రార్‌ డాక్టర్‌ శంకర్‌ మాట్లాడుతూ.. స్నాతకోత్సవానికి సహకరించాలని, నిధుల మళ్లింపుతో ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.  నిధుల విషయం తేల్చే వరకు విధులకు హాజరయ్యేది లేదని ఉద్యోగ ఐకాస నాయకులు చెప్పేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సోమవారం నుంచి ఆందోళన ఉద్ధృతం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్నాతకోత్సవాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించామని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ శంకర్‌ ప్రకటించారు. ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామన్నారు. అలాగే విశ్వవిద్యాలయం సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలకు సంబంధించిన టెండర్ల గడువు శనివారంతో ముగిసింది. టెండరును దక్కించుకున్నా.. డబ్బులు వస్తాయో.. రావో అనే సందేహాన్ని గుత్తేదారులు వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని