Interest Rates: బ్యాంకులు vs పోస్టాఫీసు.. డిపాజిట్‌ వడ్డీ రేట్లు ఎందులో ఎక్కువ?

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌క‌యితే కొన్ని బ్యాంకులు పోస్టాఫీసు ఇస్తున్న ట‌ర్మ్ డిపాజిట్ల వ‌డ్డీ రేటు క‌న్నా ఎక్కువే ఇస్తున్నాయి.

Updated : 07 Oct 2022 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్ల క‌న్నా పోస్టాఫీసు ట‌ర్మ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లు గ‌తంలో ఎక్కువే ఉండేవి. కానీ, ఈ ఏడాది మే నెల నుంచి ఆర్‌బీఐ రెపో రేటు పెంచుకుంటూ వెళ్తోంది. దీంతో దాదాపుగా అన్ని బ్యాంకులూ త‌మ డిపాజిట్లపై వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రించాయి. ఇప్పుడు పోస్టాఫీసు ట‌ర్మ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లతో స‌మానంగా వివిధ బ్యాంకులు త‌మ వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌క‌టించాయి. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌క‌యితే కొన్ని బ్యాంకులు పోస్టాఫీసు ఇస్తున్న ట‌ర్మ్ డిపాజిట్ల వ‌డ్డీ రేటు క‌న్నా ఎక్కువే ఇస్తున్నాయి. పోస్టాఫీసు ట‌ర్మ్ డిపాజిట్ అన్ని వ‌య‌సుల‌వారికీ ఒకే వ‌డ్డీ రేటును అందిస్తోంది. ఒక ఏడాదికి 5.50%, 3 ఏళ్ల‌కు 5.80% వ‌డ్డీని అందిస్తుండ‌గా.. కొన్ని బ్యాంకులు ఇదే కాలవ్య‌వ‌ధుల‌కు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన వ‌డ్డీ రేట్లు ఇంకాస్త ఎక్కువగానే ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు