UPI payments: యూపీఐ చెల్లింపుల్లో జాగ్రత్త

డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ఎంతో కీలకంగా మారింది. ఒక్క రూపాయి చెల్లించాలన్నా ఇప్పుడు దీన్నే వినియోగిస్తున్నారు

Published : 07 Jun 2024 00:34 IST

డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ఎంతో కీలకంగా మారింది. ఒక్క రూపాయి చెల్లించాలన్నా ఇప్పుడు దీన్నే వినియోగిస్తున్నారు. ఇదే సమయంలో యూపీఐ ఆధారిత మోసాల సంఖ్యా పెరిగింది. సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతుంటారు. కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉంటేనే మన సొమ్మును కాపాడుకోగలం.ముఖ్యంగా యూపీఐ చెల్లింపుల విషయానికి వస్తే..

  • మీరు నగదును స్వీకరించేటప్పుడు యూపీఐ పిన్‌ను నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి క్యూఆర్‌ కోడ్‌లనూ స్కాన్‌ చేయక్కర్లేదు.
  • కేవలం చెల్లింపులు చేసేందుకే కోడ్‌లను స్కాన్‌ చేసి, పిన్‌ను నమోదు చేయాలి. అదే విధంగా ఎవరికైనా డబ్బు పంపాలి అన్నప్పుడే యూపీఐ పిన్‌తో పని ఉంటుంది.
  • డబ్బు పంపించేటప్పుడు కచ్చితంగా అవతలి వ్యక్తి పేరును తెలుసుకోండి. అప్పుడే సరైన వ్యక్తికి మీ డబ్బు చేరుతుంది. దుకాణాల్లో గోడలకు ఉన్న క్యూఆర్‌లను స్కాన్‌ చేసిన తర్వాత పేరు సరిగ్గా వచ్చిందా లేదా ధ్రువీకరించుకున్నాకే డబ్బును పంపించండి.
  • యూపీఐ పిన్‌ను ఎవరికీ చెప్పొద్దు. ముఖ్యంగా ఎవరైనా ఫోన్‌ చేసి, యూపీఐ పిన్, ఏటీఎం పిన్‌లాంటివి అడిగితే వెంటనే ఫోన్‌ కట్‌ చేయాలి.
  • మొబైల్‌ ఫోన్లలో స్క్రీన్‌ షేరింగ్‌ యాప్‌లవంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఎవరైనా ఫోన్‌ చేసి, ఇలాంటి యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిందిగా సూచిస్తే నమ్మొద్దు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని