క్రెడిట్ నివేదిక తప్పులు లేకుండా
మీ క్రెడిట్ నివేదికను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం మర్చిపోవద్దు. అప్పుడే ఏమైనా పొరపాట్లను గుర్తిస్తే సరిదిద్దుకునేందుకు వీలవుతుంది.
రాజు ప్రైవేటు ఉద్యోగి. మంచి జీతమే వస్తోంది. గత నెల కొంత డబ్బు అవసరం ఉండి వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేశారు. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న కారణంతో బ్యాంకు అతని దరఖాస్తును తిరస్కరించింది. ఇప్పటి వరకూ తీసుకున్న అన్ని రుణాలనూ సక్రమంగా తీర్చేసిన రాజుకు తన క్రెడిట్ స్కోరు ఎందుకు తగ్గిందన్న విషయం అర్థం కాలేదు. క్రెడిట్ బ్యూరోలను సంప్రదించి, నివేదిక తీసుకున్న తర్వాత తేలిందేమిటంటే.. గత కొన్ని నెలలుగా అతని స్కోరు తగ్గుతూ వస్తోంది. తనకు సంబంధం లేకుండానే ఒక రుణ ఖాతా తన పేరుమీద ఉందని తేలింది.
ఇది ఒక్క రాజు సంగతే కాదు.. ఇటీవలి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యే ఇది. కాబట్టి, మీ క్రెడిట్ నివేదికను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం మర్చిపోవద్దు. అప్పుడే ఏమైనా పొరపాట్లను గుర్తిస్తే సరిదిద్దుకునేందుకు వీలవుతుంది.
* సాధారణంగా 750 పాయింట్లకు మించి ఉన్నప్పుడు మంచి స్కోరు కింద లెక్క. ఇలాంటి వారికి బ్యాంకులు సులభంగానే రుణాలు అందిస్తాయి. స్కోరు బాగున్నప్పుడు వడ్డీ రేట్లలోనూ రాయితీ లభిస్తుంది.
* మీరు రుణ వాయిదాలను సకాలంలోనే చెల్లిస్తున్నారు. కానీ, రుణదాత ఆ విషయాన్ని క్రెడిట్ బ్యూరోలకు సరిగ్గా నివేదించకుండా, ఆలస్యపు చెల్లింపులుగా పేర్కొన్నారనుకోండి. అప్పుడు మీ క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేనప్పుడు మీరు ఆ విషయాన్ని రుణదాత దృష్టికి తీసుకెళ్లండి. నివేదికను సరిచేయాల్సిందిగా కోరండి.
* మీ పేరు, చిరునామా, పాన్ తదితర వాటిల్లో ఎలాంటి తప్పులు, అక్షర దోషాలు లేకుండా చూసుకోండి. మీ పేరు లేదా ఇతర వివరాల్లో ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని సరిచేసుకునేందుకు ప్రయత్నించండి. దీనివల్ల స్కోరు తగ్గకపోవచ్చు. కానీ, మీరు రుణం తీసుకోవాలనుకున్నప్పుడు, కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.
* గృహ, వాహన రుణాలు తీసుకొన్న వారు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు అప్పును బదిలీ చేసుకోవడం సహజమే. ఇలాంటి సందర్భాల్లో రెండు చోట్లా బాకీ ఉన్నట్లు నివేదికలో కనిపించవచ్చు. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మీ పాత బ్యాంకును సంప్రదించి, రుణం చెల్లించినట్లుగా క్రెడిట్ బ్యూరోలకు తెలియజేయాల్సిందిగా కోరాలి.
* కొన్నిసార్లు మీ క్రెడిట్ నివేదికలో మరో వ్యక్తి తీసుకున్న రుణం వివరాలు కనిపించవచ్చు. పేర్లు, చిరునామా, పాన్‌లో తప్పులుండటం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. మీ క్రెడిట్ నివేదికలో ఇలాంటి తప్పులను గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంకు దృష్టికి దీన్ని తీసుకెళ్లండి. క్రెడిట్ బ్యూరోలకూ సమాచారం ఇవ్వండి.
* క్రెడిట్ కార్డుపై బ్యాంకు పరిమితిని పెంచుతుంది. కానీ, ఆ విషయం బ్యూరోలకు తెలియజేయకపోవచ్చు. మీరు కార్డును కొత్త పరిమితి మేరకు వాడారనుకుందాం. అప్పుడు మీరు అధికంగా వినియోగించారన్న కారణంతో స్కోరు తగ్గిపోవచ్చు. మీ క్రెడిట్ కార్డు ఖాతా వివరాల్లో ఇలాంటి పొరపాట్లు ఉంటే వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించాలి. చెల్లింపులు సరిగ్గా నమోదయ్యాయా లేదా అనేదీ సరి చూసుకోండి.
మీ నివేదికలో ఉన్న ప్రతి వివరాన్నీ జాగ్రత్తగా పరిశీలించండి. చిన్న తప్పు ఉన్నా నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే సంబంధిత బ్యాంకు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ, క్రెడిట్ బ్యూరోలను సంప్రదించి, వాటిని సరిచేసుకోవాలి. కనీసం మూడు నెలలకోసారైనా మీ క్రెడిట్ నివేదికను పరిశీలించడం ఒక అలవాటుగా చేసుకోండి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Periodic Table: పిరియాడిక్ టేబుల్‌ను ఎందుకు తొలగించామంటే..? NCERT వివరణ
-
Sports News
WTC Final: అశ్విన్ తుది జట్టులో ఉంటాడా... లేదా? ఆస్ట్రేలియా శిబిరంలో ఇదే హాట్ టాపిక్!
-
World News
Putin: చర్చితో సంబంధాలు బలపర్చుకొనే యత్నాల్లో పుతిన్..!
-
Crime News
Hyderabad: కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. రెండేళ్ల చిన్నారి మృతి
-
Movies News
Nenu student sir movie review: రివ్యూ: నేను స్టూడెంట్ సర్
-
General News
Amaravati: లింగమనేని రమేశ్ నివాసం జప్తు పిటిషన్‌పై ఈనెల 6న తీర్పు