ప్రయాణంలో తోడుగా..

ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్‌బీఐ కార్డ్‌ కొత్త క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చింది. ఎస్‌బీఐ కార్డ్‌ మైల్స్‌ ఎలైట్‌, ఎస్‌బీఐ కార్డ్‌ మైల్స్‌ ప్రైమ్‌, ఎస్‌బీఐ కార్డ్‌ మైల్స్‌ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.

Published : 26 Apr 2024 00:04 IST

ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్‌బీఐ కార్డ్‌ కొత్త క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చింది. ఎస్‌బీఐ కార్డ్‌ మైల్స్‌ ఎలైట్‌, ఎస్‌బీఐ కార్డ్‌ మైల్స్‌ ప్రైమ్‌, ఎస్‌బీఐ కార్డ్‌ మైల్స్‌ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది. ఖర్చు చేసిన ప్రతి రూ.200లకూ ఆరు ట్రావెల్‌ క్రెడిట్ రూపంలో రివార్డు పాయింట్లు జమ అవుతాయి. ఈ క్రెడిట్లను హోటళ్లలో బిల్లుల చెల్లింపు లేదా ఎస్‌బీఐ కార్డుతో భాగస్వామ్యం ఉన్న విమాన సంస్థల నుంచి టిక్కెట్లు బుక్‌ చేసుకునేందుకు వినియోగించుకోవచ్చు. ఎలైట్‌ కార్డు తీసుకున్న వారు.. 60 రోజుల్లోగా రూ.లక్ష ఖర్చు చేస్తే 5,000 వరకూ ట్రావెల్‌ క్రెడిట్‌లు వస్తాయని సంస్థ పేర్కొంది. ఎలైట్‌ కార్డును తీసుకునేందుకు వార్షిక రుసుములు రూ.4,999, ప్రైమ్‌ కార్డుకు రూ.2,999, మైల్స్‌ కార్డుకు రూ.1,499 (పన్నులు అదనం) ఉంటాయని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని