Home Loan: వాట్సాప్‌లో సులువుగా హోమ్‌లోన్ దరఖాస్తు
Home loan on whatsapp: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి గృహ రుణాలకు దరఖాస్తు చేసేవారు ఇకపై వాట్సాప్ ద్వారా కూడా ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: గృహ కొనుగోలుదారుల కోసం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ (Bajaj Housing Finance) ఆన్‌లైన్ హోమ్‌లోన్ (Home loan) అప్లికేషన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఔత్సాహిక గృహ కొనుగోలుదారులు వాట్సాప్ ద్వారా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం ఫిబ్రవరి 6 నుంచి అందుబాటులో ఉంటుంది. అర్హత గల రుణ గ్రహీత ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా సరైన వివరాలను సమర్పించడం ద్వారా హోమ్‌లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుదారులు వాట్సాప్ ద్వారా తాజా గృహ రుణం, గృహరుణం బ్యాలెన్స్ బదిలీ.. రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చని BHF తెలిపింది. దరఖాస్తు చేసేటప్పుడు.. దరఖాస్తుదారు పేరు, మొబైల్ నంబర్, పాన్ మొదలైన వాటితో సహా కొన్ని వివరాలు మాత్రమే అవసరం. వివరాలను అందించిన తర్వాత దరఖాస్తుదారులు తక్షణమే వారి అర్హత, ఆఫర్ మొత్తాన్ని తనిఖీ చేయొచ్చు. ఆసక్తి ఉన్నవారు రూ.1,999+జీఎస్‌టీ చెల్లించి ‘డిజిటల్ ఇన్-ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్’ను పొందొచ్చు.
దరఖాస్తు ఎలా చేయాలి?
BHFకు సంబంధించిన వాట్సాప్ నంబర్ ‘75075 07315’కు ‘Hi’ అని టైప్ చేయండి. మీ గృహ రుణ అర్హతను తనిఖీ చేయడానికి ఎనిమిది వివరాలను తెలపాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనవి పేరు, సంప్రదించే ఫోన్ నెంబర్లు, పాన్ మొదలైన వాటిని తెలపాలి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌లో అర్హతగల దరఖాస్తుదారులకు సంవత్సరానికి 8.60% నుంచి గృహ రుణ వడ్డీ రేట్లు ప్రారంభమవుతాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/03/23)
-
Sports News
IPL 2023:చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!
-
Education News
TTWREIS: అశోక్‌నగర్ సైనిక పాఠశాలలో ఆరు, ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం
-
Crime News
సిద్ధూ మూసేవాలా తరహాలో చంపేస్తాం.. సల్మాన్‌కు బెదిరింపు మెయిల్!
-
Sports News
BCCI: టాప్ కేటగిరిలోకి రవీంద్ర జడేజా: వార్షిక వేతన కాంట్రాక్ట్‌లను ప్రకటించిన బీసీసీఐ
-
Politics News
TDP: తెదేపా ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున సన్నాహాలు