Home Loan: వడ్డీ రేట్లు పెరిగితే.. కాలవ్యవధి, ఈఎంఐలో ఏది పెంచుకోవాలి?

ఇంటి రుణాలపై వడ్డీ రేట్లు పెరిగినప్పుడు రుణగ్రహీత చెల్లింపులు చేసే విధానంలో ఏంచేస్తే వడ్డీని ఆదాచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

Published : 19 Sep 2023 17:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మంది బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని ఇంటిని కొనుగోలు చేస్తుంటారు. ప్రతి నెలా ఈఎంఐ రూపంలో ఈ రుణాన్ని చెల్లిస్తారు. గతంలో ఇంటి రుణాలపై మెరుగైన క్రెడిట్‌ స్కోరు ఉన్నవారికి 7% వడ్డీ రేటుతోనే రుణాలు లభించేవి. కానీ, గత సంవత్సరం నుంచి ఆర్‌బీఐ రెపోరేట్లు పెంచడంతో వరుసగా రుణాల వడ్డీ రేట్లు పెరిగి 8-9 శాతానికి చేరుకున్నాయి. వడ్డీ పెరుగుదలతో మొత్తం రుణ బకాయి పెరుగుతుంది. ఈ అదనపు వడ్డీ భారాన్ని తీర్చడానికి ఈఎంఐ మొత్తాన్ని పెంచుకుంటే ప్రతి నెలా అదనంగా చెల్లించాలి. అధిక ఈఎంఐ చెల్లించలేని వారికి బ్యాంకు ఈఎంఐ అలాగే ఉంచి కాలవ్యవధి పెంచుకునే ఆప్షన్ కూడా అందిస్తుంది. మరి వీటిలో ఏది మంచిది?

ఒక వ్యక్తి 7% వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలవ్యవధి (240 నెలలు)కి ఇంటి రుణాన్ని తీసుకున్నాడనుకుందాం. రూ.25 లక్షల రుణానికి రూ.19,400 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. రుణాన్ని తీసుకున్న 3 ఏళ్ల తర్వాత వడ్డీ రేట్లు పెరిగాయి. దీంతో వడ్డీ రేటు 9.25%కు చేరింది. వడ్డీ రేటు పెరిగినా కూడా ప్రతి నెలా పాత ఈఎంఐ మొత్తాన్ని చెల్లిస్తే, మొత్తం కాలవ్యవధి పెరిగి 321 నెలలు అవుతుంది. అలా కాకుండా రూ.19,400 ఈఎంఐకి బదులు రూ.22,400 చెల్లించవచ్చు. మరి కాలవ్యవధి పెంచుకుంటే లాభమా లేక ప్రతి నెలా ఈఎంఐ పెంచి చెల్లిస్తే లాభమా అనేది కింది పట్టికలలో చూడొచ్చు.

ఈఎంఐ అలాగే ఉంచి, రుణ కాలవ్యవధిని పెంచుకుంటే.. ?

రుణ కాలవ్యవధిని పెంచకుండా, ఈఎంఐ మొత్తాన్ని పెంచుకుంటే వడ్డీపై ఎంత ఆదా చేసుకోవచ్చో కింద పట్టికలో చూడొచ్చు.

మొదటి పట్టికలో వడ్డీ రేటు పెరిగినా కూడా కాలవ్యవధిని పెంచుకుంటే రూ.25 లక్షల రుణానికి రూ.44 లక్షల వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అదే 2వ పట్టికలో తెలిపినట్టుగా ఈఎంఐని పెంచుకుంటే రూ.27.80 లక్షలు మాత్రమే మొత్తం వడ్డీని చెల్లిస్తే సరిపోతుంది. రూ.25 లక్షల రుణంపై రూ.16.20 లక్షల వడ్డీ ఆదా చేసుకోవచ్చు. అదే రూ.50 లక్షల రుణం అయితే రూ.౩౨.౪౦ లక్షలు, రూ.౭౫ లక్షల రుణం అయితే రూ.౪౯.౬౦ లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని