Home Loan: క్రెడిట్‌ స్కోరును బట్టి గృహ రుణ వడ్డీ రేట్లు..

దాదాపుగా అన్ని బ్యాంకులు మెరుగైన క్రెడిట్‌ స్కోరు ఉన్న రుణగ్రహీతలకు తక్కువ వడ్డీకే రుణాలందజేస్తాయి. వివిధ బ్యాంకుల్లో క్రెడిట్‌ స్కోరు ఆధారంగా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులుంటాయో ఇక్కడ చూడండి.

Published : 16 May 2023 16:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకులు రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఆదాయం, ఉపాధి చరిత్ర, రుణ-ఆదాయ నిష్పత్తి వంటి ఇతర అంశాలతో పాటు క్రెడిట్‌ స్కోరును చూస్తాయి. గృహ రుణం సురక్షితమైన రుణం అయినప్పటికీ, మెరుగైన క్రెడిట్‌ స్కోరు ఉన్నవారికి రుణం వేగంగా మంజూరు అవ్వడమే కాకుండా తక్కువ వడ్డీ రేటుకు కూడా పొందొచ్చు. గృహ రుణం దీర్ఘకాలం పాటు చెల్లించే రుణం కాబట్టి, క్రెడిట్‌ స్కోరు ఎక్కువ ఉండడం వల్ల వడ్డీ రేటు 0.5-1% తగ్గినా కూడా దీర్ఘకాలంలో చాలా ఆదా అవుతుంది. 

క్రెడిట్‌ స్కోరుకు అనుగుణంగా గృహ రుణ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో కింది పట్టికలో చూడండి

గమనిక: పట్టికలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వారి వెబ్‌సైట్‌లో క్రెడిట్‌ స్కోరుతో లింక్‌ చేసిన గృహ రుణ వడ్డీ రేట్ల ప్రకారం ఈ డేటాను తెలిపాం. వడ్డీ రేటు సూచిక, వాస్తవ పరిస్థితిలో వివిధ కారకాలు, బ్యాంకుకు సంబంధించిన నియమ, నిబంధనలను బట్టి వడ్డీ రేట్లు మారవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని