Home Loan: గృహ రుణాల వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?

దాదాపుగా అన్ని బ్యాంకులు సరసమైన వడ్డీ రేట్లకే హోమ్‌ లోన్స్‌ ఇస్తున్నాయి. వివిధ బ్యాంకులు ఈ రుణాలపై వసూలుచేసే వడ్డీ రేట్లను ఇక్కడ చూద్దాం.

Published : 12 Sep 2023 18:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఇంటి నిర్మాణానికి దాదాపుగా అందరూ బ్యాంకు రుణం వైపే మొగ్గుచూపుతారు. వడ్డీ రేటు తక్కువగా ఉండడం, రుణాన్ని తీర్చే కాలవ్యవధి సుదీర్ఘంగా ఉండడం వల్ల రుణగ్రహీతలకు ఈఎంఐలు సౌకర్యవంతంగా ఉంటాయి. వినియోగదారులు గరిష్ఠంగా 30 ఏళ్ల సుదీర్ఘ కాలవ్యవధితో రుణాలను తీసుకోవచ్చు. అయితే, ఇంటి రుణ వడ్డీ రేట్లు.. సిబిల్‌ స్కోరు, జీతం, కాలవ్యవధి మొదలైన వివిధ అంశాల ఆధారంగా మారుతూ ఉంటాయి. వడ్డీ రేట్లలో మార్పులు ఆర్‌బీఐ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. గృహ రుణాలపై దాదాపుగా అన్ని బ్యాంకులు ప్రాసెసింగ్‌ ఫీజులు, డాక్యుమెంట్‌ ఛార్జీలు వసూలు చేస్తాయి. కొన్ని బ్యాంకులు రుణ మొత్తంపై ఇంత శాతం అని, లేదా కనిష్ఠ/గరిష్ఠ ఛార్జీలుగా కొద్ది మొత్తాన్ని వసూలు చేస్తాయి. దీనికి జీఎస్‌టీ అదనం. 

ఇంటి రుణాలపై వివిధ బ్యాంకులు వసూలు చేసే కనిష్ఠ, గరిష్ఠ వడ్డీ రేట్లను ఈ కింది పట్టికలో చూడండి..

గమనిక: ఈ డేటా 2023 సెప్టెంబరు 7 నాటిది. ప్రాసెసింగ్‌ ఫీజులు, ఇతర ఛార్జీలు ఇందులో కలపలేదు. మెరుగైన ఆదాయం, క్రెడిట్‌ స్కోరు ఉన్న వారికి మాత్రమే ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. వృత్తి, వయసు, క్రెడిట్‌ స్కోరును బట్టి వడ్డీ రేట్లలో మార్పులుండొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు