Credit Card: మీకు ఏ క్రెడిట్ కార్డు బెస్ట్? ఎలా ఎంపిక చేసుకోవాలో చూద్దాం!
Credit Card: ఒక్కో సంస్థ ఒక్కో రకమైన క్రెడిట్ కార్డు, ఒక్కో విధమైన ప్రయోజనాలను అందిస్తుంటాయి. మరి ఇన్నింటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలి? దేన్ని ఆధారంగా చేసుకోవాలో చూద్దాం..!
క్రెడిట్ కార్డు (Credit Card) తీసుకుంటారా? అంటూ రోజూ ఫోన్‌కాల్స్ వస్తున్నాయి కదా! ఏదైనా పనిమీద బ్యాంకుకు వెళితే అక్కడ కూడా ఉద్యోగులు క్రెడిట్ కార్డేమైనా అవసరం ఉందా? అని అడుగుతుంటుంటారు. నిజానికి ఈ ఆఫర్లు మన ఆదాయం, క్రెడిట్ స్కోర్, ఖర్చు చేసే తీరును ఆధారంగా చేసుకుకొని ఇస్తుంటారు.
తొలిసారి క్రెడిట్ కార్డు (Credit Card) తీసుకునేవారికైతే.. ప్రాథమిక ప్రయోజనాలతో కూడిన కార్డును ఆఫర్ చేస్తారు. అదే ఇప్పటికే వాడుతున్న వారైతే క్రెడిట్ చరిత్ర ఆధారంగా చేసుకొని మరిన్ని అధిక ప్రయోజనాలున్న కార్డును ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తాయి. ఒక్కో సంస్థ ఒక్కో రకమైన కార్డు, ఒక్కో విధమైన ప్రయోజనాలను అందిస్తుంటాయి. మరి ఇన్నింటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలి? చూద్దాం..
మీరు దేనికి అర్హులు?
క్రెడిట్ కార్డు (Credit Card) పొందడానికి ఆదాయం, క్రెడిట్ స్కోరే ఆధారం. స్థిర ఆదాయం, 750 కంటే అధిక క్రెడిట్ స్కోర్ ఉంటే కార్డు పొందడం సులభం. గతంలో ఎలాంటి రుణం తీసుకోకుండా.. ఎలాంటి క్రెడిట్ కార్డు వాడకుండా ఉన్నట్లయితే సుదీర్ఘ క్రెడిట్ చరిత్ర ఉండదు. దీనికి అస్థిర ఆదాయం కూడా జతైతే కార్డు పొందడం కష్టతరమే. అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఆధారంగా చేసుకొని కార్డు పొందే వెసులుబాటు ఉంది.
మీ జీవన విధానానికి అనుగుణంగా..
ఆదాయం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా చేసుకొని మీరు ఒకటికంటే ఎక్కువ కార్డులు పొందేందుకు అర్హులు కావొచ్చు. అలాంటప్పుడు అసలు కార్డు ద్వారా మీరు ఎలాంటి లక్ష్యాలను చేరుకోవాలనుకుంటున్నారనేది కీలకం. మీరు కోరుకున్న జీవన విధానాన్ని అనుభవించడానికి కార్డు ఉపయోగకరంగా ఉండాలి. అంటే మీ అవసరాలు, కోరికలకు అనుగుణంగా కార్డు ప్రయోజనాలు ఉంటే మేలు. దేనిపై మీరు ఎక్కువ ఖర్చు చేస్తారు? ఎక్కడెక్కడ క్రమంగా డబ్బు వెచ్చిస్తారు? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు మీరు తరచూ ఆన్‌లైన్ షాపింగ్ చేయాల్సి ఉండొచ్చు. తరచూ ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. అప్పుడప్పుడు రెస్టరెంట్లకు వెళ్తుండొచ్చు. పైన తెలిపిన ప్రదేశాల్లో మీకు కార్డు ఉపయోగకరంగా ఉండేలా చూసుకోవాలి. ఆయా ప్రయోజనాలు కల్పించే కార్డునే ఎంపిక చేసుకోవాలి.
వీటిని నివారించాలి..
కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీలు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటాయి. ఎన్ని లాభాలున్నా.. అవి మన అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా.. లేదా.. అనేదే ప్రధానమైంది. ఉదాహరణకు కొవిడ్ సంక్షోభ సమయంలో ప్రయాణాలపై రాయితీలు, టికెట్ బుకింగ్‌లపై తగ్గింపు, ఎయిర్‌పోర్ట్‌లో లాంజ్ యాక్సెస్ వంటి ప్రయోజనాలున్న కార్డుని తీసుకొని ఉంటే దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొంది ఉండేవాళ్లం కాదు. అదే ఆన్‌లైన్ షాపింగ్‌పై ఆఫర్లు, రివార్డు పాయింట్లు ఇచ్చే కార్డయితే ఎంతో ఉపయోకరంగా ఉండేది. ఇప్పుడొస్తున్న అనేక కార్డులు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ఆర్డర్లపై అనేక రాయితీలు, తగ్గింపులను ఆఫర్ చేస్తున్నాయి. కానీ, అవన్నీ మనకు ఎంత వరకు ఉపయోగపడతాయో చూసుకోవాలి.
ఉచిత కార్డు లేక ప్రీమియం కార్డు?
కొన్ని కార్డులపై ఎలాంటి వార్షిక రుసుము ఉండదు. మరికొన్ని కార్డులపై మాత్రం కచ్చితంగా రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని ప్రీమియం ప్రయోజనాలు పొందాలంటే ఛార్జీలు చెల్లించాల్సిందే. ఉచిత సినిమా టికెట్ నుంచి విమానాశ్రయాల్లో అపరిమిత లాంజ్ యాక్సెస్, విలాసవంతమైన హోటళ్లలో స్టే వరకు.. కార్డు రకం, మనం చెల్లించే ఛార్జీని బట్టి అనేక ప్రయోజనాలు ఉంటాయి. నిజానికి ఈ ప్రయోజనాలు వార్షికంగా మనం చెల్లించే రుసుములపైనే ఆధారపడి ఉంటాయి. ఎంత ఎక్కువ చెల్లిస్తే అన్ని ఎక్కువ ప్రయోజనాలుంటాయి. ఒక్కోసారి కార్డుపై నిర్దేశించిన మొత్తం ఖర్చు చేస్తే రుసుమును రద్దు చేస్తుంటారు. మరి ఉచిత కార్డు తీసుకోవాలా? లేక ప్రీమియం కార్డు తీసుకోవాలా? అనేది అవసరాలు, లక్ష్యాలు, ఖర్చు చేసే తీరు.. వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఒక బ్రాండ్‌కు విశ్వాసపాత్రులా?
షాపింగ్, ప్రయాణం, ఇంధన, ఆహారం.. ఇలా వివిధ కెటగిరీలకు వర్తించే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు (Credit Card)లు కూడా అందుబాటులో ఉంటాయి. ఒక ప్రత్యేక బ్రాండ్‌పై మీకు విశ్వాసం ఉంటే.. దాంట్లో మీరు చేసే కొనుగోళ్లపై అధిక ప్రయోజనం పొందడం కోసం కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా మీకు నచ్చిన బ్రాండ్‌పై కొనుగోళ్లు కూడా పెరుగుతాయి. అలా కాకుండా ఎక్కడైనా కొనుగోలు చేయడానికి వీలుండాలనుకుంటే కో-బ్రాండెడ్ కార్డుల జోలికి వెళ్లకపోవడమే మంచిది.
మీరు తీసుకోబోయే క్రెడిట్ కార్డ్ (Credit Card)పై లభించే రివార్డుల గురించి తప్పనిసరిగా ముందే తెలుసుకోండి. పైగా కార్డుని తరచూ ఉపయోగిస్తేనే రివార్డు పాయింట్లు లభిస్తాయి. కార్డుపై చేసే వ్యయాలు నిర్దేశించిన పరిమితిని దాటితే అధిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. పైగా కార్డు మీకు ఎలా ఉపయోగపడుతుంది.. దాని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటేనే.. ఏ కార్డు తీసుకోవాలో మీకు స్పష్టత వస్తుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
World News
Erdogan: జైలు నుంచి అధ్యక్షపీఠం వరకు.. ఎర్డోగాన్ రాజకీయ ప్రస్థానం..!
-
Politics News
AAP-Congress: ఆర్డినెన్స్‌పై పోరు.. ఆమ్ఆద్మీకి కాంగ్రెస్ మద్దతిచ్చేనా?
-
India News
అవినీతి ఆరోపణలు.. రోల్స్‌రాయిస్‌పై సీబీఐ కేసు
-
India News
హరివంశ్ నారాయణ్.. భావితరాలకు మీరు చెప్పేది ఇదేనా?: జేడీయూ
-
Sports News
IPL 2023: శుభ్‌మన్ గిల్ విషయంలో కోల్‌కతా ఘోర తప్పిదమదే: స్కాట్ స్టైరిస్