FD Rates: వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ

ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించాయి. వివిధ కాలపరిమితులు గల ఎఫ్‌డీలపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

Published : 06 Dec 2023 17:40 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీఐసీఐ బ్యాంకు రూ.2-5 కోట్లు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించింది. 7-14 రోజుల కనీస కాలవ్యవధి ఎఫ్‌డీలపై 4.75% వడ్డీని ఆఫర్‌ చేస్తోంది. ఇప్పటివరకు ఇదే కాలవ్యవధి ఎఫ్‌డీలపై వడ్డీ 3% మాత్రమే ఉండేది. బ్యాంకు 1 సంవత్సరం నుంచి 15 నెలల మధ్య కాలవ్యవధి గల ఎఫ్‌డీలపై అత్యధికంగా 7.25% వడ్డీ రేటును అందించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు రూ.2-5 కోట్ల ఎఫ్‌డీలపై సీనియర్‌ సిటిజన్లకు ఎలాంటి అదనపు వడ్డీ అందించడం లేదు. సీనియర్‌ సిటిజన్లు సాధారణ డిపాజిటర్లతో సమానంగా వడ్డీ రేటును అందుకుంటారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా రూ.5 కోట్ల కంటే ఎక్కువ మొత్తాల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంకు 7-14 రోజుల కనీస కాలవ్యవధి గల ఎఫ్‌డీలపై 4.75% వడ్డీని ఆఫర్‌ చేస్తోంది. ఏడాది నుంచి 15 నెలల మధ్య కాలవ్యవధి గల ఎఫ్‌డీలపై గరిష్ఠంగా 7.25% వడ్డీని అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు