Home Loan: ఇంటి రుణాలపై వడ్డీ రేట్లు ఏయే బ్యాంకుల్లో ఎంతెంత?

దాదాపు అన్ని బ్యాంకులు ఇంటి కొనుగోలుకు రుణాలిస్తున్నాయి. ఈ రుణాలకు వసూలుజేసే వడ్డీ రేట్లను ఇక్కడ చూడొచ్చు.

Published : 17 Nov 2023 15:04 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంటి నిర్మాణం, కొనుగోలుకు ప్రయత్నించేవారు చాలామంది బ్యాంకు రుణం తీసుకోవాలని కోరుకుంటారు. ఇంటిపై అధిక వ్యయం, ఈ రుణాలపై వడ్డీ రేట్లు తక్కువ ఉండడం వల్ల కూడా చాలా మంది బ్యాంకులు అందజేసే రుణంపై మొగ్గు చూపిస్తారు. బ్యాంకు లేదా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) నుంచి ఇంటి రుణం తీసుకోవచ్చు. వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. రుణం తీసుకోవాలని భావించేవారు ఏ బ్యాంకులో వడ్డీ రేటు తక్కువగా ఉందో తెలుసుకోవాలి. ఇంటి రుణ ఈఎంఐలు దీర్ఘకాలం పాటు ఉంటాయి. అందువల్ల వడ్డీ రేటులో ఏ మాత్రం తగ్గింపు ఉన్నా దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. 

ఇంటి రుణాలపై వివిధ బ్యాంకులు వసూలుజేసే వడ్డీ రేట్లను ఈ కింది పట్టికలో చూడండి..

గమనిక: ఈ డేటా 2023, నవంబర్‌ 12 నాటిది. పై పట్టికలో బ్యాంకులు వసూలు చేసే అత్యల్ప వడ్డీ రేట్లు తెలిపాం. క్రెడిట్‌ స్కోరు, రుణ మొత్తం, పనిచేసే సంస్థ, వృత్తి ప్రొఫైల్‌ మొదలైన వాటిపై వడ్డీ రేటు, రుణ మంజూరు ఆధారపడి ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని