Car Loans: సెకండ్‌ హ్యాండ్‌ కారు రుణాలపై వడ్డీ రేట్లు ఏయే బ్యాంకుల్లో ఎంతెంత?

తక్కువ బడ్జెట్‌లో కారు కొనుగోలు చేసేవారు సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనుగోలుకు మొగ్గు చూపుతారు. ఈ కార్ల కొనుగోళ్లపై బ్యాంకులు కూడా విరివిగానే రుణాలిస్తున్నాయి. ఈ రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లను ఇక్కడ చూద్దాం.

Published : 07 Sep 2023 14:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతంతో చూస్తే కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. భారత్‌లో అత్యధిక ప్రజానీకం కలిగి ఉన్న మధ్య తరగతి వారు కూడా ఈ కార్ల కొనుగోలుకు కొంత కాలం నుంచి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలో చాలామంది తక్కువ బడ్జెట్‌లో కారును కొనుగోలు చేయడానికి సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ మార్కెట్‌ కూడా బాగా విస్తరించడంతో వీటి కొనుగోళ్లపై బ్యాంకులు కూడా వేగంగానే రుణాలిస్తున్నాయి. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే ఉపయోగించిన కారు రుణాలపై బ్యాంకులు తక్కువ వడ్డీ రేటునే వసూలు చేస్తున్నాయి.

కొనుగోలు జాగ్రత్తలు

కొత్త కారులా కాకుండా పాత కారును కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలే తీసుకోవాలి. తప్పనిసరిగా కారు బయట, లోపల దాని స్థితిని తనిఖీ చేయాలి. టెస్ట్‌ డ్రైవ్‌తో కారు కండీషన్‌ తెలుసుకోవాలి. కారు ఎలా స్టార్టు అవుతోంది? రన్నింగ్‌లో కారు పనితీరు పరిశీలించాలి. కారును చెక్‌ చేయడానికి నిపుణుడైన కారు మెకానిక్‌ను వెంట తీసుకెళ్లడం మంచిది. కారు ఆర్‌సీ, బీమా పత్రాలు, పొల్యూషన్‌ సర్టిఫికేట్‌ సక్రమంగా ఉన్నాయా లేదా చెక్‌ చేయాలి. వాహనంపై ఏవైనా రుణాలు ఉంటే వాటిని కూడా పరిశీలించాలి. కారు సర్వీస్‌, నిర్వహణ రికార్డుల కోసం తనిఖీ చేయండి. బాగా నిర్వహించిన కారులో తప్పనిసరిగా సాధారణ సర్వీసింగ్‌ రికార్డు ఉంటుంది.

క్రెడిట్‌ స్కోరు

మెరుగైన రుణాన్ని పొంద‌డానికి వేర్వేరు బ్యాంకులు అందించే కారు రుణ ఆఫ‌ర్ల‌ను పోల్చి చూసుకోవాలి. కారు రుణం అందజేసేటప్పుడు మీ వ్యక్తిగత ఆదాయాన్ని, క్రెడిట్‌ స్కోరును బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. చాలా బ్యాంకులు త‌మ రుణ రేట్ల‌ను క్రెడిట్ స్కోర్‌ల‌తో అనుసంధానించాయి. కాబ‌ట్టి 750 లేదా అంత‌కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికి త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కు కారు రుణం పొంద‌డానికి అర్హ‌త ఉంటుంది. త‌క్కువ క్రెడిట్ స్కోర్ క‌లిగి ఉన్న‌వారికి బ్యాంకు రుణం ఇవ్వకపోవచ్చు. లేదా రుణంపై బ్యాంకులు అధిక వడ్డీని వసూలు చేయొచ్చు. అందుచేత కారు రుణానికి ప్రయత్నించే ముందు మీ క్రెడిట్ నివేదిక‌ల‌ను త‌నిఖీ చేసుకోవాలి. 

రూ.5 లక్షల కారు రుణంపై 3 ఏళ్ల కాలవ్యవధికి ఈఎంఐను కింది పట్టికలో చూడొచ్చు..

గమనిక: ఈ డేటా 2023, సెప్టెంబర్‌ 1 నాటిది. బ్యాంకులు తెలిపిన అత్య‌ల్ప వ‌డ్డీ రేట్లు మాత్ర‌మే ఇక్కడ ఇవ్వ‌డం జ‌రిగింది. మీ లోన్ మొత్తం, క్రెడిట్ స్కోరు, చేసే వృత్తిపై బ్యాంకు విధించే ఇత‌ర నిబంధ‌న‌లు, ష‌ర‌తులపై ఆధార‌ప‌డి మీకు వ‌ర్తించే వ‌డ్డీ రేటులో మార్పులుండొచ్చు. ప్రాసెసింగ్‌ ఫీజులు ఈఎంఐలో కలపలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని