FD Rates: సీనియర్‌ సిటిజన్ల ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంకులివే..

చాలా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు సీనియర్‌ సిటిజన్లకు అధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. 1, 3, 5 ఏళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను ఇక్కడ చూడండి.

Updated : 03 Jun 2024 15:17 IST

డబ్బును రిస్క్‌ లేని పథకాలలో పెట్టుబడి పెట్టడానికి బ్యాంకు డిపాజిట్లు అత్యంత అనువైన ఆప్షన్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా, రిస్క్‌కు దూరంగా ఉండే సీనియర్‌ సిటిజన్లకు బ్యాంకు డిపాజిట్లు మరింత మెరుగైన ఆప్షన్‌. సాధారణ డిపాజిట్లతో పోలిస్తే, సీనియర్‌ సిటిజన్లకు దాదాపుగా అన్ని బ్యాంకులు 0.50% అదనపు వడ్డీని అందిస్తున్నాయి. రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై సీనియర్‌ సిటిజన్ల పొందగల వడ్డీ రేట్లు కింద ఉన్నాయి. 1, 3, 5 ఏళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను ఇక్కడ చూడండి.

ఈ డేటా 2024, మే 29 నాటిది.

గమనిక: అన్ని బ్యాంకుల ఎఫ్‌డీలపై రూ.5 లక్షల వరకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌(DICGC) రక్షణ ఉంటుంది. మీరు ఈ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేటప్పుడు వడ్డీతో కలిపి రూ.5 లక్షల లోపు మొత్తం ఉండేలా జాగ్రత్త పడాలి. డిపాజిట్‌ పరిధి రూ.5 లక్షల లోపు ఉంటేనే మీరు పూర్తి ఆర్థిక రక్షణలో ఉన్నట్లుగా భావించాలి. పెరుగుతున్న వడ్డీ రేట్లపై ఆశతో స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో అధిక మొత్తంలో డిపాజిట్‌ చేయకపోవడం ఎల్లప్పుడూ మంచిదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని