Special Deposits: స్పెషల్‌ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఎంతెంత?

అనేక బ్యాంకులు స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. సాధారణ ఎఫ్‌డీలతో పోలిస్తే స్పెషల్‌ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు కొద్దిగా అదనంగా ఉంటున్నాయి.

Published : 08 Dec 2023 17:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మంది హామీతో కూడిన రాబడిని ఎంచుకుంటారు. అందులో బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ముందు వరుసలో ఉంటాయి. అన్ని బ్యాంకులూ కస్టమర్లకు ప్రధానంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సౌకర్యాన్ని అందిస్తున్నాయి. గతంలో ఎఫ్‌డీలపై వడ్డీ తక్కువ ఉన్నప్పటికీ.. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు చేపట్టినప్పటి నుంచి అన్ని బ్యాంకులూ వడ్డీ రేట్లు పెంచుతూ వచ్చాయి. సాధారణ ఎఫ్‌డీలతో పాటు చాలా బ్యాంకులు స్పెషల్‌ ఎఫ్‌డీలను ఆఫర్‌ చేస్తున్నాయి. వీటిపై మిగతా డిపాజిట్లతో పోలిస్తే వడ్డీ రేట్లు కొద్దిగా ఎక్కువే ఉంటున్నాయి. అలా ఏ బ్యాంకు స్పెషల్‌ ఎఫ్‌డీలో డిపాజిట్‌ చేస్తే ఎంత వడ్డీ వస్తుందో ఈ కింది పట్టికలో చూడొచ్చు.

నోట్‌: ఈ డేటా 2023 డిసెంబర్‌ 1 నాటిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు