కోటక్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. రూపే క్రెడిట్‌ కార్డులతో UPI పేమెంట్స్‌

Kotak Mahindra Bank: కోటక్‌ బ్యాంక్‌ వినియోగదారులు తమ రూపే క్రెడిట్‌ కార్డులను యూపీఐ చెల్లింపులకు వినియోగించుకొనే సదుపాయాన్ని బ్యాంక్‌ తీసుకొచ్చింది.

Updated : 28 Jun 2023 15:56 IST

దిల్లీ: ప్రైవేటు రంగానికి చెందిన కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (Kotak Mahindra Bank) తమ క్రెడిట్‌ కార్డు (Credit card) యూజర్లకు కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌తో (NPCI) కలిసి రూపే క్రెడిట్‌ కార్డులను యూపీఐ యాప్స్‌లో వినియోగించుకునే వెసులుబాటును తీసుకొచ్చింది. రూపే నెట్‌వర్క్‌పై పనిచేసే 7 రకాల క్రెడిట్‌ కార్డు యూజర్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

కోటక్‌ రూపే క్రెడిట్‌ కార్డులను యూపీఐకి లింక్‌ చేయడం ద్వారా ఫిజికల్‌ కార్డును తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది. క్యూఆర్‌ కోడ్‌లు, పీఓఎస్‌ డివైజుల వద్ద క్రెడిట్‌ కార్డుల ద్వారా లావాదేవీలు జరపొచచ్చని పేర్కొంది. ఈ కార్డులను ఇ-కామర్స్‌ లావాదేవీలకూ వినియోగించుకోవచ్చని పేర్కొంది. యూపీఐ చెల్లింపులపై రివార్డు పాయింట్లతో పాటు 50 రోజుల వరకు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

BHIM, ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌ పే, స్లైస్‌, మొబిక్విక్‌ వంటి యాప్స్‌లో ఈ రూపే క్రెడిట్ కార్డులను వినియోగించుకోవచ్చని కోటక్‌ బ్యాంక్‌ తెలిపింది. రూపే క్రెడిట్‌ కార్డులతో యూపీఐతో లింక్‌ చేసుకునే సదుపాయాన్ని ఆర్‌బీఐ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్‌ సైతం ఈ సదుపాయాన్ని తీసుకురాగా.. మరికొన్ని బ్యాంకులూ దీన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని