ప్రత్యేక ఎఫ్‌డీలను ప్రారంభించిన నార్త్‌ ఈస్ట్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌

నార్త్‌ ఈస్ట్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులో ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై గరిష్ఠంగా 9.25% వడ్డీ వరకు పొందొచ్చు.

Published : 18 Mar 2024 17:40 IST

దిల్లీ: నార్త్‌ ఈస్ట్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (NESFB) కొత్త ఎఫ్‌డీ పథకాలను ప్రారంభించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 366 రోజుల నుంచి 1095 రోజుల కాలవ్యవధి ప్రత్యేక ఎఫ్‌డీపై సాధారణ డిపాజిటర్లకు 7.75%, 400 రోజుల ప్రత్యేక పథకంపై 8.4%, 555 రోజులు, 1111 రోజుల కాలవ్యవధి ప్రత్యేక పథకాలపై 8.5% వడ్డీని బ్యాంకు అందిస్తోంది. ఈ డిపాజిట్ల అన్నింటిపై సీనియర్‌ సిటిజన్లు 0.75% వడ్డీని అదనంగా  పొందుతారు. అంటే గరిష్ఠంగా 9.25% వడ్డీ వరకు అందుకుంటారు. రూ.5 కోట్ల వరకు డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఈ బ్యాంకులో 7 రోజుల నుంచి 365 రోజుల ఎఫ్‌డీలపై 3.25% నుంచి 7% వరకు వడ్డీని సాధారణ డిపాజిటర్లు పొందుతారు. సీనియర్‌ సీటిజన్లు అదనంగా 0.75% వడ్డీ పొందొచ్చు. రూ.2 కోట్ల వరకు డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని