PM-KISAN: కిసాన్‌ పథకం 12వ విడత విడుదల..!

రైతులకు గుడ్‌న్యూస్‌. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (PM-KISAN) పథకం కింద 12వ విడుత ప్రయోజనాన్ని ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.

Published : 17 Oct 2022 14:41 IST

రైతులకు గుడ్‌న్యూస్‌. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (PM-KISAN) పథకం కింద 12వ విడత ప్రయోజనాన్ని ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. న్యూఢిల్లీలో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేసారు. ఈ పథకం కింద అర్హులైన 11 కోట్ల మంది రైతులకు రూ. 16 వేల కోట్ల విలువైన ప్రయోజనాన్ని విడుదల చేశారు. ముందుగా ఊహించినట్లుగానే దీపావళి ముందు, రబీ పంట సమయంలో ప్రభుత్వం రైతుల ఖాతాలో నిధులను జమ చేసింది. 12వ విడత డబ్బు విడుదలతో ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల ఖాతాలో జమ చేసిన మొత్తం రూ. 2.16 లక్షల కోట్లు దాటిందని అంచనా.  

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు ప్రభుత్వం ప్రతీ సంవత్సరం రూ. 6000 ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తోంది. ఈ మొత్తం ఒకేసారి కాకుండా ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి రూ. 2000 చొప్పున మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తుంది. ఒకవేళ మీరు కూడా ఈ పథకం లబ్ధిదారులు అయితే ఈ ఖాతాలో డబ్బు జమైందా లేదా అనేది https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌ బెనిఫిషరీ లిస్ట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని