RBI: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా

Eenadu icon
By Business News Team Updated : 19 Dec 2024 16:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

RBI | దిల్లీ: ప్రభుత్వరంగానికి చెందిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB)కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) జరిమానా విధించింది. ఆర్‌బీఐ మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రుణాలు, అడ్వాన్సులకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనకు గానూ పీఎన్‌బీపై రూ.1.31 కోట్ల జరిమానా విధించింది. కస్టమర్ల చిరునామాలకు సంబంధించిన రికార్డులను భద్రపరచడంలో పీఎన్‌బీ విఫలమైందని ఓ ప్రకటనలో వెల్లడించింది.

జియో.. రూ.55,000 కోట్ల ఐపీఓ?

బ్యాంక్‌ పనితీరుపై 2022 మార్చి30న ఆర్‌బీఐ తనిఖీ నిర్వహించింది. ఆ సమయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలు పాటించని బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. బ్యాంకు వివరణతో సంతృప్తి చెందని ఆర్‌బీఐ.. తాజాగా జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పీఎన్‌బీతో పాటు ఇటీవలే గుజరాత్ రాజ్య కర్మచారి కో-ఆపరేటివ్ బ్యాంక్, రోహికా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (బిహార్‌), నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (మహారాష్ట్ర), బ్యాంక్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లకు (పశ్చిమ బెంగాల్‌) ఆర్‌బీఐ జరిమానా విధించింది.

Tags :
Published : 06 Jul 2024 14:21 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని