SBI Amrit Kalash: ‘అమృత్‌ కలశ్‌’ గడువు మరోసారి పెంపు.. ఎప్పటి వరకంటే?

SBI news: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన ‘అమృత్‌ కలశ్‌’ డిపాజిట్‌ పథకం గడువును మరోమారు పొడిగించింది.

Updated : 08 Apr 2024 14:17 IST

SBI Amrit Kalash | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన స్పెషల్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ‘అమృత్‌ కలశ్‌’ (SBI Amrit Kalash) పథకం గడువును మరోసారి పొడిగించింది. 400 రోజుల కాలవ్యవధితో వస్తున్న ఈ పథకం గడువు మార్చి 31తో ముగియగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు పెంచింది. గతంలోనూ ఈ పథకం గడువును పలుమార్లు ఎస్‌బీఐ పొడిగించింది.

ఈ స్కీమ్‌ కింద సీనియర్‌ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు లభిస్తుంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం వడ్డీపై మూలం వద్ద పన్ను (TDS) కోత ఉంటుంది. ఎస్‌బీఐ శాఖలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2 కోట్లలోపు మొత్తాలకు ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. స్వల్పకాలిక లక్ష్యంతో మదుపు చేసేవారికి అమృత్‌ కలశ్‌ పథకం ప్రయోజనకరం. పైగా డిపాజిట్‌ను ముందుగా ఉపసంహరించుకోవచ్చు. రుణ సదుపాయం కూడా ఉంది.

ఎస్‌బీఐ లేటెస్ట్‌ వడ్డీ రేట్లు..

ఇక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాల వడ్డీ రేట్ల విషయానికొస్తే.. రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై ఎస్‌బీఐ వడ్డీ రేట్లు 3.5 శాతం నుంచి ప్రారంభమవుతాయి. గరిష్ఠంగా 7 శాతం వడ్డీ (అమృత్‌ కలశ్‌ కాకుండా) లభిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకైతే 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని