SBI Credit Card: ఎస్‌బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్‌ క్రెడిట్‌ కార్డులు.. ప్రయోజనాలివే..!

SBI Credit Card: ఎస్‌బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్‌ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!

Published : 29 Apr 2024 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తరచూ విమాన ప్రయాణాలు చేసేవారిని దృష్టిలో ఉంచుకొని ఎస్‌బీఐ కార్డు ఇటీవల ప్రత్యేక క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చింది. దీంట్లో ఎస్‌బీఐ కార్డ్‌ మైల్స్‌, మైల్స్‌ ఎలైట్‌, మైల్స్‌ ప్రైమ్‌ పేరిట మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటిపై లభించే ట్రావెల్‌ క్రెడిట్లను ఎయిర్‌ మైల్స్‌, హోటల్‌ పాయింట్లు, రివార్డులు, లాంజ్‌ యాక్సెస్‌లుగా మార్చుకోవచ్చు. ఎస్‌బీఐ కార్డు మొత్తం 20 విమానయాన సంస్థలు, హోటల్‌ బ్రాండ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కార్డుల్లోని ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఎస్‌బీఐ కార్డ్‌ మైల్స్‌..

  • వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద రూ.1,500 ట్రావెల్‌ క్రెడిట్లు
  • ప్రయాణాలపై చేసే ప్రతి రూ.200 ఖర్చుకు 2, ఇతర వ్యయాలపై 1 ట్రావెల్‌ క్రెడిట్లు
  • ప్రతి రూ.లక్ష వ్యయంపై ఒక అదనపు దేశీయ లాంజ్‌ యాక్సెస్‌
  • ఏడాదిలో రూ.5 లక్షలు ఖర్చు చేస్తే 5,000 బోనస్‌ ట్రావెల్‌ క్రెడిట్లు
  • ఏడాదిలో ఖర్చు రూ.6 లక్షలు దాటితే వార్షిక ఫీజు వాపస్‌
  • ప్రతి ఏడాది నాలుగు డొమెస్టిక్‌ లాంజ్‌ యాక్సెస్‌
  • ప్రయారిటీ పాస్‌ మెంబర్‌షిప్‌తో 1000కి పైగా అంతర్జాతీయ లాంజ్‌లకు యాక్సెస్‌
  • కార్డును విదేశాల్లో వినియోగిస్తే 3 శాతం మాత్రమే ఫారెన్‌ కరెన్సీ మార్కప్‌ ఛార్జ్‌
  • అన్ని పెట్రోల్‌ పంపుల్లో 1 శాతం ఇంధన సర్‌ ఛార్జి రాయితీ
  • వార్షిక ఫీజు రూ.1,499+ జీఎస్‌టీ

ఎస్‌బీఐ కార్డ్‌ మైల్స్‌ ప్రైమ్‌..

  • వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద రూ.3,000 ట్రావెల్‌ క్రెడిట్లు
  • ప్రయాణాలపై చేసే ప్రతి రూ.200 ఖర్చుకు 4, ఇతర వ్యయాలపై 2 ట్రావెల్‌ క్రెడిట్లు
  • ప్రతి రూ.లక్ష వ్యయంపై ఒక అదనపు దేశీయ లాంజ్‌ యాక్సెస్‌
  • ఏడాదిలో రూ.8 లక్షలు ఖర్చు చేస్తే 10,000 బోనస్‌ ట్రావెల్‌ క్రెడిట్లు
  • ఏడాదిలో ఖర్చు రూ.10 లక్షలు దాటితే వార్షిక ఫీజు వాపస్‌
  • ప్రయారిటీ పాస్‌ మెంబర్‌షిప్‌తో 1000కి పైగా అంతర్జాతీయ లాంజ్‌లకు యాక్సెస్‌
  • ప్రతి ఏడాది ఎనిమిది డొమెస్టిక్‌ లాంజ్‌ యాక్సెస్‌
  • కార్డును విదేశాల్లో వినియోగిస్తే 2.50 శాతం మాత్రమే ఫారెన్‌ కరెన్సీ మార్కప్‌ ఛార్జ్‌
  • అన్ని పెట్రోల్‌ పంపుల్లో 1 శాతం ఇంధన సర్‌ ఛార్జి రాయితీ
  • విమానాల రద్దు, ఎయిర్‌ యాక్సిడెంట్‌ బీమా
  • వార్షిక ఫీజు రూ.2,999+ జీఎస్‌టీ

ఎస్‌బీఐ కార్డ్‌ మైల్స్‌ ఎలైట్‌..

  • వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద రూ.5,000 ట్రావెల్‌ క్రెడిట్లు
  • ప్రయాణాలపై చేసే ప్రతి రూ.200 ఖర్చుకు 6, ఇతర వ్యయాలపై 2 ట్రావెల్‌ క్రెడిట్లు
  • ప్రతి రూ.లక్ష వ్యయంపై ఒక అదనపు దేశీయ లాంజ్‌ యాక్సెస్‌
  • ఏడాదిలో రూ.12 లక్షలు ఖర్చు చేస్తే 20,000 బోనస్‌ ట్రావెల్‌ క్రెడిట్లు
  • ఏడాదిలో ఖర్చు రూ.15 లక్షలు దాటితే వార్షిక ఫీజు వాపస్‌
  • ప్రయారిటీ పాస్‌ మెంబర్‌షిప్‌తో 1000కి పైగా అంతర్జాతీయ లాంజ్‌లకు యాక్సెస్‌
  • ప్రతి ఏడాది ఎనిమిది డొమెస్టిక్‌ లాంజ్‌ యాక్సెస్‌
  • విదేశాల్లో వినియోగిస్తే 1.99 శాతం మాత్రమే ఫారెన్‌ కరెన్సీ మార్కప్‌ ఛార్జ్‌
  • అన్ని పెట్రోల్‌ పంపుల్లో 1 శాతం ఇంధన సర్‌ ఛార్జి రాయితీ
  • విమానాల రద్దు, ఎయిర్‌ యాక్సిడెంట్‌ బీమా
  • వార్షిక ఫీజు రూ.4,999+ జీఎస్‌టీ
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని