గృహ రుణాలపై SBI ఆఫర్‌.. ప్రాసెసింగ్‌ ఫీజుపై డిస్కౌంట్

గృహ రుణ ప్రాసెసింగ్‌ ఫీజుపై ఎస్‌బీఐ రాయితీ ప్రకటించింది. వడ్డీ రేట్లపైనా రాయితీ ఇస్తోంది. ఆగస్టు 31 వరకు ఈ రాయితీ వర్తిస్తుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ తెలిపింది.

Published : 15 Jul 2023 15:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) గృహ రుణాలు (Home loan) తీసుకోవాలనుకునే వారికి ఆఫర్‌ ప్రకటించింది. హోమ్‌లోన్‌ ప్రాసెసింగ్‌ ఫీజుపై (processing fee) 50-100 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 31 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

సాధారణంగా ఎస్‌బీఐ హోమ్‌లోన్‌ తీసుకునేటప్పుడు 0.35 శాతం ప్రాసెసింగ్‌ ఫీజుగా వసూలు చేస్తారు. కనీస మొత్తం రూ.2000 కాగా.. గరిష్ఠంగా రూ.10వేలు వరకు ప్రాసెసింగ్‌ ఫీజు తీసుకుంటారు. దీనికి జీఎస్టీ అదనం. ఈ నేపథ్యంలో సాధారణ హోమ్‌లోన్‌, టాప్ అప్‌ రుణాలకు 50 శాతం వరకు రాయితీ ప్రకటించారు. అంటే కనీస ప్రాసెసింగ్‌ ఫీజు రూ.2వేలు, గరిష్ఠంగా రూ.5వేలు ఉంటుంది. దీనికి జీఎస్టీ అదనం. అదే టేకోవర్‌, రీసేల్‌, రెడీ టు మూవ్‌ ప్రాపర్టీలకు అయితే 100 శాతం వరకు రాయితీ ఇస్తామని ఎస్‌బీఐ పేర్కొంది. ఇన్‌స్టా హోమ్‌టాప్‌, రివర్స్‌ మార్టగేజ్‌, ఈఎండీకి ఈ రాయితీ వర్తించదని తెలిపింది.

SBIలో PPF ఖాతా.. ఆన్‌లైన్‌లో సులువుగా ఇలా తెరవండి..

అలాగే హోమ్‌లోన్‌ వడ్డీ రేట్లపైనా ఎస్‌బీఐ రాయితీ ఇస్తోంది. సిబిల్‌ స్కోరును బట్టి ఈ రాయితీ వర్తిస్తుంది. సిబిల్‌ స్కోరు 750+ ఉన్న వారికి 8.70 శాతం వడ్డీకే రుణాలు లభించనున్నాయి. వీరికి గరిష్ఠంగా 45 బేసిస్‌ పాయింట్లు రాయితీ ఇస్తున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. అదే 700-749 పాయింట్లు ఉన్న వారికి 55 బేసిస్‌ పాయింట్ల రాయితీతో 8.80 శాతం వడ్డీకే రుణాలు అందించనున్నట్లు పేర్కొంది. ఆగస్టు 31లోపు మంజూరయ్యే హోమ్‌లోన్లకే ఈ రాయితీ వర్తిస్తుందని బ్యాంక్‌ పేర్కొంది. మరోవైపు ఎస్‌బీఐ నిధుల ఆధారిత వడ్డీ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 5 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచింది. కొత్త రేట్లు జులై 15 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త వడ్డీరేట్లు కాల వ్యవధిని బట్టి 8% నుంచి 8.75% మధ్య ఉండనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని