SBI Homeloan: హోమ్‌లోన్లపై ఎస్‌బీఐ ఆఫర్‌.. వీరికి వడ్డీపై రాయితీ

SBI offer: గృహ రుణాలపై రాయితీ ఇస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికి తక్కువకే రుణాలు లభిస్తాయి. డిసెంబర్‌ 31 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

Published : 05 Sep 2023 13:30 IST

SBI Homeloan offer | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) గృహ రుణాలపై (Home loan) ఆఫర్‌ ప్రకటించింది. పండగ సీజన్‌ను పురస్కరించుకుని స్పెషల్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. హోమ్‌లోన్‌పై గరిష్ఠంగా 65 బేసిస్‌ పాయింట్ల వరకు రాయితీ ఇస్తున్నట్లు బ్యాంక్‌ పేర్కొంది. సెప్టెంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు ఈ రాయితీలు ఇవ్వనున్నారు. త్వరలో గృహ రుణాలు తీసుకోవాలనుకునేవారు ఈ ఆఫర్‌ను పరిశీలించొచ్చు.

ప్రస్తుతం వడ్డీ రేట్లు 9.15 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉన్నాయి. క్యాంపెయిన్‌లో భాగంగా 8.6 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉండనున్నాయి. క్రెడిట్‌ స్కోర్‌ ఎక్కువగా ఉన్నవారు తక్కువ వడ్డీకే రుణాలు ఆనందించొచ్చు. ప్రస్తుతం ఎక్సటర్నల్‌ బెంచ్‌ మార్క్ రేట్‌ (EBR) 9.15 శాతం ఉండగా.. సిబిల్‌ స్కోరు 750 నుచి 800 మధ్య ఉన్నవావారికి గరిష్ఠంగా 55 బేసిస్‌ పాయింట్లు రాయితీ లభిస్తుంది. అంటే 8.60 శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయి.

30ల్లో పదవీ విరమణ ప్రణాళిక.. ‘టూ ఎర్లీ’ అంటారా? ఇది చదవండి..

సిబిల్‌ స్కోరు 700- 749 బేసిస్‌ పాయింట్లు ఉన్నవారికి 65 బేసిస్‌ పాయింట్లు రాయితీ లభిస్తుంది. ప్రస్తుతం ఈ క్రెడిట్‌ స్కోరు ఉన్న వారికి 9.35 శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నారు. క్యాంపెయిన్‌లో భాగంగా 8.70 శాతానికే రుణం లభించనుంది. సిబిల్‌ స్కోరు 650-699 పాయింట్లు ఉన్న వారికి 9.45 శాతానికి, 550-649 మధ్య ఉన్న వారికి 9.65 శాతం వడ్డీకి రుణాలు ఇస్తారు. అలాగే సిబిల్ స్కోరు 151-200 మధ్య ఉన్న వారికీ, ఎలాంటి క్రెడిట్‌ స్కోరూ లేని వారికీ 65 బేసిస్‌ పాయింట్లు రాయితీ ఇస్తున్నారు. అలాగే, గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజు రూ.2 వేలు నుంచి రూ.10 వేల మధ్య ఉంటాయి. జీఎస్టీ అదనం. మరిన్ని వివరాలకు ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని