SBI Sarvottam FD: ఎస్‌బీఐ సర్వోత్తమ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌.. 7.90% వరకు వడ్డీరేటు

SBI Sarvottam FD: సర్వోత్తమ్‌ పేరిట ఎస్‌బీఐ కొత్త ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ను తీసుకొచ్చింది. దీంట్లో వడ్డీరేటు 7.9 శాతం వరకు లభిస్తోంది.

Published : 10 Mar 2023 12:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ సర్వోత్తమ్‌ పేరిట కొత్త ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (SBI Sarvottam Fixed Deposit) పథకాన్ని తీసుకొచ్చింది. ఇది నాన్‌-కాలబుల్‌ డిపాజిట్‌ స్కీమ్‌. అంటే కాలపరిమితి ముగియడానికి ముందే ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉండదు. తప్పనిసరై తీసుకుంటే జరిమానా ఉంటుంది. అలాగే వడ్డీరేటూ తగ్గుతుంది.

కనిష్ఠంగా రూ.15 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.5 కోట్ల వరకు డిపాజిట్‌ చేయొచ్చు. వడ్డీరేటు 7.1 శాతం నుంచి 7.9 శాతం వరకు ఉంది. ఏడాది, రెండేళ్ల కాలపరిమితితో డిపాజిట్‌ చేయొచ్చు. పీపీఎఫ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌, ఇతర పోస్టాఫీస్‌ డిపాజిట్‌ స్కీమ్‌లతో పోలిస్తే వడ్డీరేటు అధికంగానే ఉంది. ఈ స్కీమ్‌ కింద చేసే డిపాజిట్లను రెన్యువల్‌ చేయించుకోవడానికి వీలుండదు. కాలపరిమితి ముగియగానే వడ్డీతో కలిపి ఖాతాలో జమవుతుంది.

ఎస్‌బీఐలో సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లలో వడ్డీరేట్లు 3 శాతం నుంచి 7.5 శాతం వరకు ఉంది. కాలపరిమితి, డిపాజిట్‌ చేసే మొత్తాన్ని బట్టి ఇది మారుతుంది. సీనియర్‌ సిటిజన్లకు అధిక వడ్డీరేటు లభిస్తుంది.

☛ సర్వోత్తమ్‌ స్కీమ్‌లో భాగంగా రూ.15 లక్షల నుంచి రూ.2 కోట్ల డిపాజిట్లపై లభించే వడ్డీరేటు..

☛ సర్వోత్తమ్‌ స్కీమ్‌లో భాగంగా రూ.రెండు కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై లభించే వడ్డీరేటు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని