Car Loan: పాత కారు కొంటున్నారా?
కొత్త కారు కొన్నప్పుడు బ్యాంకులు సులభంగానే రుణాలను మంజూరు చేస్తాయి. మరి, పాత కారును తీసుకోవాలంటే చాలామంది తమ సొంత డబ్బును వాడుకుంటుంటారు.
కొత్త కారు కొన్నప్పుడు బ్యాంకులు సులభంగానే రుణాలను మంజూరు చేస్తాయి. మరి, పాత కారును తీసుకోవాలంటే చాలామంది తమ సొంత డబ్బును వాడుకుంటుంటారు. మరికొందరు, వీలైనంత వరకూ అప్పు తీసుకోవాలని అనుకుంటారు. ఇలాంటి వారు కొన్ని విషయాలను పరిశీలించాకే రుణం తీసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాం.
ఒకప్పుడు పాత కార్లకు అంత తేలిగ్గా రుణం వచ్చేది కాదు. ఇచ్చినా బ్యాంకులు అధిక వడ్డీని వసూలు చేసేవి. ప్రస్తుతం వాడిన కార్ల మార్కెట్ విపరీతంగా పెరిగింది. బ్యాంకులూ ఈ అవకాశాన్ని వదులుకోవడం లేదు. 10 శాతం వరకూ వడ్డీకి ఈ రుణాలను ఇస్తున్నాయి.
అర్హతను బట్టి..
పాత కార్లకు రుణాలను ఇచ్చేటప్పుడు బ్యాంకులు కొన్ని విషయాల్లో కచ్చితంగా ఉంటాయి. రుణగ్రహీత వయసు, ఆదాయం, ఉద్యోగ అనుభవం, క్రెడిట్ స్కోరులాంటివి పరిశీలిస్తాయి. రుణం తీసుకునే ముందు రెండు మూడు చోట్ల విచారించాలి. సాధారణంగా 750కి మించి క్రెడిట్ స్కోరున్నప్పుడు సులభంగానే రుణం వస్తుంది. నెలకు కనీసం రూ.10వేలకు మించి ఆదాయం ఉన్నప్పుడే రుణానికి అర్హత ఉంటుంది.
ఎంత మొత్తం?
పాత వాహనం రకం, మోడల్‌ను బట్టి రుణ మొత్తం ఆధారపడి ఉంటుంది. కారు విలువ, రుణగ్రహీత చెల్లింపు సామర్థ్యం, బీమా ప్రీమియం, పన్నులు అన్నింటినీ బ్యాంకు పరిశీలిస్తుంది. కొత్త రుణం తీసుకునే ముందు రుణగ్రహీతలు తమ ఇతర ఆర్థిక బాధ్యతలనూ చూసుకోవాలి. ఎలాంటి ఇబ్బందీ లేదు అనుకున్నప్పుడే ముందుకు వెళ్లాలి. కారు కొన్న కొన్ని రోజులకే ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని అమ్మేయాల్సి వచ్చే సందర్భాలు రాకుండా చూసుకోవాలి. కారు విలువలో కనీసం 20 లేదా అంతకన్నా ఎక్కువ శాతం చెల్లించాలి. మిగతాదే రుణం తీసుకునే ప్రయత్నం చేయాలి.
వ్యవధి ఎంపికలో..
రుణాన్ని ఎన్నాళ్లలో తీర్చాలనుకుంటున్నారు అనేదీ ముఖ్యమే. మీ దగ్గర మిగులు మొత్తం ఎక్కువగా ఉంటే.. నెలవారీ వాయిదాను పెంచుకోవచ్చు. మీకు ఇబ్బంది కలగనంత వరకూ ఈఎంఐ చెల్లించే ఏర్పాటు చేసుకోండి. దీర్ఘకాలిక వ్యవధిని ఎంచుకున్నప్పుడు ఈఎంఐ తగ్గుతుంది. అదే సమయంలో వడ్డీ కొంత అధికంగా చెల్లించాల్సి వస్తుంది. స్వల్ప వ్యవధిని ఎంచుకున్నప్పుడు వాయిదా మొత్తం అధికంగా ఉంటుంది. వడ్డీ తగ్గుతుంది. రుణం తొందరగా తీరుతుంది. మీ ఆదాయంలో మిగులును బట్టి, వ్యవధిని నిర్ణయించుకోవాలి.
వడ్డీ రేట్లు..
సాధారణంగా పాత కార్ల రుణాలకు వడ్డీ అధికంగా ఉంటుంది. ఇవి స్థిర వడ్డీ రుణాలు కాబట్టి, ఒకసారి నిర్ణయించిన వడ్డీ అప్పు తీరేంత వరకూ మారదు. కాబట్టి, రుణం ఎంచుకునేటప్పుడే తక్కువ వడ్డీకి రుణం ఇస్తున్న బ్యాంకును ఎంపిక చేసుకోవాలి. దీనికోసం ముందుగానే తగిన పరిశోధన చేయాలి.
ముందే తీర్చేస్తే..
రుణాన్ని ముందుగా తీర్చే వెసులుబాటు ఉంటుంది. బాకీ ఉన్న మొత్తంపై 6 శాతం వరకూ ముందస్తు చెల్లింపు రుసుములను వసూలు చేస్తాయి బ్యాంకులు. కాబట్టి, చెల్లించే వడ్డీ రుసుముకన్నా అధికంగా ఉంటోంది అనుకున్న సందర్భంలోనే దీని గురించి ఆలోచించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TATA Sons IPO: అదే జరిగితే.. భారత్‌లో అతిపెద్ద ఐపీఓ టాటా గ్రూప్ నుంచే!
-
WhatsApp Channel: వాట్సాప్ ఛానెల్‌కు 50 లక్షల మంది ఫాలోవర్లు.. ప్రత్యేక మెసేజ్ పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
-
Team India: ఇక్కడో జట్టు.. అక్కడో జట్టు.. కొత్త పుంతలు తొక్కుతున్న భారత క్రికెట్
-
800 Movie: విజయ్ సేతుపతి కుటుంబాన్ని బెదిరించారు: ముత్తయ్య మురళీధరన్ వ్యాఖ్యలు
-
Hyderabad: గణేశ్ నిమజ్జనానికి MMTS ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..!
-
Hyderabad: తెలంగాణ పోలీసింగ్ ఓ సక్సెస్ స్టోరీ: డీజీపీ