Trump-Modi: మోదీ అంటే చాలా గౌరవం.. అతి త్వరలో ట్రేడ్ డీల్‌: ట్రంప్‌

Eenadu icon
By Business News Team Published : 29 Oct 2025 12:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ప్రధాని నరేంద్రమోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ప్రశంసలు కురిపించారు. మోదీ (PM Modi) అంటే తనకు చాలా గౌరవమని అన్నారు. భారత్‌తో అతి త్వరలోనే వాణిజ్య ఒప్పందం (US-India Trade Deal) జరగనున్నట్లు ట్రంప్‌ (Donald Trump) వెల్లడించారు.

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ట్రంప్‌.. ఆసియా పసిఫిక్ ఎకనామిక్‌ కార్పొరేషన్ (అపెక్‌) సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌-అమెరికా (US-India) సంబంధాల గురించి ప్రస్తావించారు. భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలను గుర్తుచేస్తూ అణ్వాయుధ సామర్థ్యం ఉన్న రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తాను ఆపానంటూ మరోసారి చెప్పారు. ఆ ఉద్రిక్తతల సమయంలో టారిఫ్‌లతో బెదిరించానంటూనే మోదీపై ప్రశంసలు కురిపించడం గమనార్హం.

‘‘భారత ప్రధాని నరేంద్రమోదీ అంటే నాకు చాలా గౌరవం. ఆయన మంచి వ్యక్తి. ఆయన లాంటి తండ్రి ఉండాలని చాలామంది కోరుకుంటారు. అయితే ఆయన సంక్లిష్టమైన వ్యక్తి. బలమైన నేత. పాక్‌తో యుద్ధం కొనసాగిస్తామని అన్నారు. అలా జరిగితే భారత్‌పై టారిఫ్‌లు భారీగా పెంచుతానని హెచ్చరించా. అటు పాక్‌ను కూడా బెదిరించా. దీంతో వారు యుద్ధాన్ని ఆపారు’’ అంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. భారత్‌తో అతిత్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరనున్నట్లు వెల్లడించారు.

భారత్‌-అమెరికా మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతోన్న వాణిజ్య చర్చలు త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ట్రేడ్‌ డీల్‌తో భారత్‌పై ట్రంప్‌ టారిఫ్‌లు (Trump Tariffs on India) భారీగా దిగి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 50శాతం ఉన్న టారిఫ్‌లు.. 15-16 శాతానికి తగ్గే అవకాశం ఉందని ఇటీవల పలు కథనాలు వెల్లడించాయి. అంతేగాక, రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకునేందుకు భారత్‌ అంగీకరించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని