Uber: 1,00,000 సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల ఫ్లీట్‌కు ఉబర్‌ ప్రణాళికలు

Eenadu icon
By Business News Team Updated : 31 Oct 2025 15:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Uber Auto | ఇంటర్నెట్‌ డెస్క్‌: క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థ ఉబర్‌ (Uber) కీలక నిర్ణయం తీసుకుంది. భారీ స్థాయిలో ఆటోమేషన్‌ వైపు వేగంగా అడుగులు వేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా 2027 నాటికి అమెరికాలో 1,00,000 సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లతో ఫ్లీట్‌ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. వీటిని తయారుచేయడానికి అమెరికాకు చెందిన సంస్థ ఎన్‌విడియా (Nvidia)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనివల్ల ఉబర్‌ డ్రైవర్‌ ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

అమెరికాలో ఎన్‌విడియా సంస్థకు చెందిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఉబర్‌, ఎన్‌విడియా అధికారిక వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. ఉబర్‌ రోబోటాక్సిస్‌ను లక్ష్యంగా పెట్టుకొని 2027లో పెద్దఎత్తున సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల (Self Driving Cars)ను ప్రారంభించనుంది. ఇందుకు కావాల్సిన ఏఐ స్వీయ-డ్రైవింగ్ టెక్నాలజీ, హార్డ్‌వేర్, సెన్సార్లు, సాఫ్ట్‌వేర్‌లను ఎన్‌విడియా అందించనుంది. సిస్టమ్స్ ఇంటిగ్రేషన్‌లో ఫాక్స్‌కాన్ సంస్థ ఉబర్‌కు సహకారం అందించనుంది. ఈ వాహనాలకు కావాల్సిన రిమోట్ అసిస్టెన్స్‌, ఛార్జింగ్, క్లీనింగ్, నిర్వహణ, కస్టమర్ సర్వీస్ వంటి అంశాలను ఉబర్‌ పర్యవేక్షిస్తుంది. వీటిని రూపొందించడానికి కావాల్సిన పైలట్ ప్రోగ్రామ్‌లు, టెస్టింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. 

మన దేశంలో ఎస్‌జే-100 విమానాల తయారీ

వీటిని రూపొందించడానికి  ‘రోబోటాక్సీ డేటా ఫ్యాక్టరీ’ని నిర్మించాలని ఉబర్‌ (Uber) యోచిస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుత ఉబర్‌ తమ ప్రయాణికులకు సేవలు అందించడానికి మిలియన్ల సంఖ్యలో గిగ్‌ వర్కర్లను నియమించుకుంటోంది. ఈ సంస్థ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే.. ఆ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే అమెరికాలోని పలుచోట్ల ఉబర్‌ పరిమిత సంఖ్యలో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

Tags :
Published : 29 Oct 2025 13:03 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు